బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2017 (16:29 IST)

ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి బయటికొస్తే.. పరిస్థితులు మారిపోతాయా? దీప మాట్లాడితే శశివర్గానికే దెబ్బే!

చిన్నమ్మ శశికళ రాజకీయ వ్యూహం ముందు పన్నీర్ సెల్వం.. బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయారు. తమిళ రాజకీయాలు గరంగరంగా మారడంతో పన్నీర్ వర్గీయులు ఆందోళనకు గురైయ్యారు. గురువారం మధ్యాహ్నం జయలలిత మేనకోడలు దీపా జ

చిన్నమ్మ శశికళ రాజకీయ వ్యూహం ముందు పన్నీర్ సెల్వం.. బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయారు. తమిళ రాజకీయాలు గరంగరంగా మారడంతో పన్నీర్ వర్గీయులు ఆందోళనకు గురైయ్యారు. గురువారం మధ్యాహ్నం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇంటికి పన్నీర్ సెల్వం వర్గీయులు పరుగుతీశారు.

దీపా జయకుమార్ తో సహ దీపా పేరవై సంస్థ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలతో చర్చలు మొదలుపెట్టారు. అయితే దీపాతో చర్చలు జరుపుతున్న నాయకులు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
శశికళ వర్గానికి చెందిన ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి కావడానికి అనుమతి ఇవ్వడంతో పన్నీర్ సెల్వం వర్గీయులు మరో కోణంలో ఆలోచిస్తున్నారు. మొదట రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వస్తే తరువాత పరిస్థితులు మారిపోతాయని అనుకుంటున్నారు. కానీ అది అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో దీపా మాట్లాడితే పరిస్థితులు మారిపోయే అవకాశం ఉందని.. ఆ రోజు త్వరలోనే వస్తుందని పన్నీర్ వర్గీయులు అంటున్నారు. అదే జరిగితే శశికళ వర్గానికి పెద్ద దెబ్బ అని రాజకీయ ప్రముఖులు అంటున్నారు.
 
మరోవైపు తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు డీఎంకే పక్కా ప్లాన్ వేస్తోంది. అనారోగ్యంతో ఇంటికే పరిమితం అయిన తమినాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ కురుణానిధి రంగంలోకి దిగారు. ప్రస్తుత పరిస్థితిలో అతిగా ముందుకు పోవడం మంచిది కాదని కరుణానిధి స్టాలిన్‌కు సూచించారని తెలిసింది. అందుకే డీఎంకే నేతలు ఆచితూచి అడుగులేస్తున్నారు. 
 
తమిళనాడులో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చే కంటే రిసార్ట్‌లో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని డీఎంకే పార్టీ నిర్ణయించిందని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న శశికళ వర్గం నాయకులు అలర్ట్ అయ్యారు.
 
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలను పక్కనబెట్టి ఎన్నికలకు వెళ్తే బెస్ట్ అనే కోణంలో డీఎంకే ఆలోచిస్తోంది. అన్నాడీఎంకే చీలికతో రంగంలోకి కరుణానిధి దిగడంతో అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు హడలిపోతున్నాయి.  అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి పదవి అంశం ట్విస్ట్‌ల మీద ట్విస్టులు కొనసాగుతోంది. తాజాగా, ముఖ్యమంత్రి పదవికి అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎంపిక చేసిన పళని స్వామికి దక్కనుంది.
 
అనూహ్యంగా ఆయనకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పళని స్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వారం రోజులైనా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోకపోయిన పన్నీర్ సెల్వం.. పళనికే మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.