శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (10:05 IST)

తమిళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. బంగాళాఖాతంలో వాయుగుండం..

తమిళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు తెలిపారు. లక్షదీవుల సమీపంలో బంగాళఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉండటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

తమిళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు తెలిపారు. లక్షదీవుల సమీపంలో బంగాళఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉండటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సోమవారం ఉదయం నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో భారీగా వర్షాలు పడతాయని తెలిపారు.
 
చెన్నై నగరంలో ఆదివారం ఆకాశం మేఘావృతమై కనిపించినా అక్కడక్కడా చిరుజల్లులు మాత్రమే పడ్డాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు జిల్లాల్లో సోమవారం పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని వాతావరణ పరిశోధన కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. పుదుచ్చేరి, కారైకాల్‌ తదితర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరుగా వర్షం కురుస్తుందని చెప్పారు.