Widgets Magazine

కండక్టర్ కామకేళి... విద్యార్థితో స్వలింగ సంపర్కం....

సోమవారం, 13 ఆగస్టు 2018 (10:08 IST)

sadist

ఓ మినీ బస్సు కండక్టర్ కిరాతక చర్య కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాల ముగిసి ఇంటికి వెళుతున్న ఎనిమిదో తరగతి చదివే విద్యార్థిని బలవంతంగా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి స్వలింగ సంపర్కం జరిపాడు. ఆ తర్వాత ఈ విషయం బయటకు చెబుతాడని భయపడిన కండక్టర్.. ఆ విద్యార్థిని హత్య చేశాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా క.పరమత్తి సమీపంలో ఉన్న విశ్వనాథపురం అనే గ్రామంలో జరిగింది.
 
ఈ గ్రామానికి చెందిన విశ్వనాథన్‌ అనే వ్యక్తి కుమారుడు చిరంజీవి (13). స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన చిరంజీవి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇరుగపొరుగువారి వద్ద ఆరా తీయగా సమాచారం తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ క్రమంలో బుధవారం ఎంజీఆర్‌నగర్‌ కాలువ సమీపంలో ఉన్న సీలైకోడులో ఓ బాలుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు క.పరమత్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతి చెందిన విద్యార్థి చిరంజీవి అని నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు. చిరంజీవిని విశ్వనాథపురి సలైవైక్కల్‌ వీధికి చెందిన ప్రైవేట్‌ మినీ బస్సు కండక్టర్‌ ప్రదీప్‌ (19) మంగళవారం సాయంత్రం తీసుకుని వెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. పాఠశాల ముగిసి ఇంటికి వెళుతున్న చిరంజీవిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, అతన్ని బెదిరించి స్వలింగ సంపర్కానికి పాల్పడినట్టు వెల్లడించాడు. ఆ తర్వాత ఈ విషయం తల్లిదండ్రులకు చెపుతానని చిరంజీవి చెప్పడంతో ఆగ్రహించి హత్య చేసినట్టు చెప్పాడు. ఫలితంగా ప్రదీప్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
మిని బసు కండక్టర్ హోమో సెక్సువల్ Kill Student Homosexuality తమిళనాడు Tamil Nadu Mini Bus Conductor

Loading comments ...

తెలుగు వార్తలు

news

నారు మడికి నీరు కట్టేందుకు వెళ్లి.. పొలంలోనే...

రైతులు తమకు అన్నం పెట్టే పంటపొలాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో రైతు ...

news

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్‌ చటర్జీ కన్నుమూత

లోక్‌సభ మాజీ స్పీకర్, సీపీఎం కురువృద్ధుడు సోమనాథ్ ఛటర్జీ ఇకలేరు. ఆయన వయసు 89 యేళ్లు. గత ...

news

నా చావుకు ఆ వ్యక్తే కారణం అమ్మా.. నీవు జాగ్రత్త : కొడుకు సూసైడ్

ఓ వ్యక్తి తన తల్లిని వేధిస్తున్నాడనీ ఓ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పైగా, నీవు ...

news

తిరుపతిలో మరో వైద్య విద్యార్థిని సూసైడ్...

తిరుపతిలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల పీజీ వైద్య విద్యార్థిని ...

Widgets Magazine