Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీటీవీ దినకరన్‌‌ను ఎప్పుడో పార్టీ నుంచి తొలగించాం.. శశికళతో సంబంధం లేదు

మంగళవారం, 6 జూన్ 2017 (11:46 IST)

Widgets Magazine
ttv dinakaran

ఆర్కే నగర్ ఎన్నికల వ్యవహారంలో ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఎరచూపి అడ్డంగా దొరికిపోయిన దినకరన్ ఊచలు లెక్కించాడు. అయితే బెయిల్‌పై బయటికి వచ్చిన టీటీవీ దినకరన్‌ను అన్నాడీఎంకే పార్టీ నుంచి ఎప్పుడో తొలగించామని రాష్ట్ర ఆర్థిక, మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ వెల్లడించారు.

అయితే తనను తొలగించే అధికారం ఆయనకు ఎవరిచ్చారంటూ దినకరన్‌ ఫైర్ అవుతున్నారు. జయకుమార్ ప్రధాన కార్యదర్శిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జయకుమార్ అధ్యక్షతన 17మంది మంత్రులు సోమవారం భేటీ అయ్యారు. ఆపై డి.జయకుమార్ సీఎం పళని సామితోనూ మాట్లాడారు. అనంతరం మీడియా జయకుమార్ మాట్లాడుతూ.. 
 
‘అమ్మ’ ప్రభుత్వాన్ని ఆదర్శంగా నడిపించే విషయమై సమావేశం నిర్వహించామని, అలాగే శాసనసభ సమావేశాల నిర్వహణ గురించి కూడా చర్చించామని తెలిపారు. ‘అమ్మ’ పాలనను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఉత్తమరీతిలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు పాలనకు ఢోకా లేదన్నారు. 
 
టీటీవీ దినకరన్‌ తదితరులను తొలగించిన విషయంలో దృఢంగా ఉన్నామని, పార్టీకి చెందిన ఎవరూ దినకరన్‌ను కలవరని పునరుద్ఘాటించారు. శశికళ వర్గంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెల్ ‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టాడు.. షాక్ కొట్టి చనిపోయాడు.. ఎక్కడ?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎప్పుడూ ఫోన్లను చేతిలో పెట్టుకుని తిరుగుతూ.. వాటితోనే కాలం ...

news

మక్కామసీదుకు 500 కిలోల ఖర్జూర ఫలాలిచ్చిన అరబ్ రాజు.. ఔరంగజేబు కానుకగా ఏమిచ్చారంటే?

మక్కామసీదు వద్ద దీక్ష విరమణ సమయంలో ఉచితంగా అందించేందుకుగాను అరబ్‌ దేశ రాజు(యూఏఈ కింగ్‌) ...

news

డొనాల్డ్ ట్రంప్‌తోనూ సత్సంబంధాలున్నాయ్.. భారతీయుల భద్రతే ముఖ్యం: సుష్మా స్వరాజ్

అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో అమెరికాతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నామో.. ...

news

యూపీలో లైంగికదాడి బాధితులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు.. ఎందుకని?

ఉత్తరప్రదేశ్‌లో గతవారం నడిరోడ్డుపై లైంగిక దాడికి గురైన బాధితులు ఆత్మహత్యాయత్నం చేశారు. ...

Widgets Magazine