మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (15:30 IST)

'ప్రజాస్వామ్యం మరణించింది.. నా ఓటు నీకు కాదు'.. శశికళపై బ్రేవ్ గర్ల్ సాంగ్ (Video)

తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా ఓ యువతి పాడిన పాట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యువతి బృందానికి అనేక మంది నెటిజన

తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా ఓ యువతి పాడిన పాట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యువతి బృందానికి అనేక మంది నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. 'ప్రజాస్వామ్యం మరణించింది... నా ఓటు నీకు కాదు' అంటూ ఈ పాట సాగుతుంది. 
 
'ఓట్లు పొందకుండానే డొల్ల ప్రకటనలు.. విశ్వసనీయత లేకుండా తప్పుడు ప్రమాణాలు.. ఇక్కడ ఎవరూ మంచి వారు కారు.. నా ఓటు నీకు కాదు..' ఇలా సూటిపోటి మాటలతో చెన్నైకు చెందిన సంగీతకారిణి సోఫియా అష్రఫ్‌ కంపోజ్‌ చేసిన పాట సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 
 
తమిళనాడు ముఖ్యమంత్రిగా పార్టీ నేతలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ఎన్నుకున్న నేపథ్యంలో ఈ పాటను సోఫియా రూపొందించారు. సోఫియా ఆదివారం తమిళనాడులోని పోయెస్ గార్డెన్ రోడ్లపై తిరుగుతూ ఈ పాటను ప్రదర్శించి ఆ వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ.. 'ప్రజాస్వామ్యం మరణించింది' అని పోస్ట్‌ చేశారు.
 
ఈ పాట ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణంపై తమిళనాడు సెంటిమెంట్‌ను ప్రతిబింభించేలా ఉంది. తమ ప్రదర్శనను ఓ పోలీసు అధికారి ఆపడానికి ప్రయత్నించారని, తన వస్త్రధారణ సరిగా ఉన్నా మందలించాడని ఫేస్‌బుక్‌లో సోఫియా పోస్ట్‌ చేశారు. సోఫియా గతంలో కొడైకెనాల్‌లో కాలుష్యం గురించి ఓ పాటను రూపొందించి వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే.