శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (10:11 IST)

జలకండేశ్వర్‌కి భారీ విరాళాలు.. నోట్ల రద్దుతో రూ.44లక్షలు హుండీలో పడ్డాయ్..

తమిళనాడులోని సుప్రసిద్ధ ఆలయం జలకండేశ్వర్ ఆలయానికి భారీ విరాళాలు వస్తున్నాయి. 400 ఏళ్లు కలిగిన ఈ శివాలయం చుట్టూ మతపరమైన వివాదం ఉంది. అది 1981లో పరిష్కారం అయింది. దీంతో ప్రస్తుతం ఈ ఆలయ సంరక్షణను ఆర్కియా

తమిళనాడులోని సుప్రసిద్ధ ఆలయం జలకండేశ్వర్ ఆలయానికి భారీ విరాళాలు వస్తున్నాయి. 400 ఏళ్లు కలిగిన ఈ శివాలయం చుట్టూ మతపరమైన వివాదం ఉంది. అది 1981లో పరిష్కారం అయింది. దీంతో ప్రస్తుతం ఈ ఆలయ సంరక్షణను ఆర్కియాలాజికల్ సర్వే కూడా చూస్తోంది. ఈ నేపథ్యంలో 16వ శతాబ్ధంలో నిర్మితమైన ఈ ఆలయానికి నోట్ల రద్దుతో మంచి కాలం వచ్చింది. 
 
ఎప్పుడూ చిన్న చిన్న కానుకలు తప్ప ఏనాడు భారీ విరాళాలు వచ్చింది లేదని, కానీ పెద్ద నోట్ల రద్దుతో ఆలయానికి అనూహ్యంగా పెద్ద మొత్తం విరాళంగా వచ్చిందని..  గుర్తు తెలియని వ్యక్తులు రూ.44 లక్షలు రూ.500, రూ.1000 నోట్లలో విరాళంగా ఇచ్చారు.
 
దీనిపై జలకండేశ్వరర్ ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తం ఒక భక్తుడుగానీ, లేదా కొంతమంది కలిసిగానీ ఇచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇంతపెద్ద మొత్తంలో ఆలయానికి విరాళం రావడం ఇదే తొలిసారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ మొత్తాన్ని బ్యాంకుల్లో జమచేసి మారుస్తామని వెల్లడించారు.