గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 28 అక్టోబరు 2016 (15:52 IST)

దేశంలో నెం.1 తాగుబోతుల రాష్ట్రం తమిళనాడు.. ఆదాయం రూ. 29,672 కోట్లు

విజ‌య‌వాడ‌: మ‌ందు తాగే వారిని నీచంగా చూస్తాం గాని, మ‌న ప్ర‌భుత్వాల‌కు వాళ్ళే టాక్స్ పేయ‌ర్స్. వాళ్ళ నుంచి వ‌చ్చే ఆద‌యంతోనే ప‌బ్లిక్ కి అంటే మ‌న‌కు సౌక‌ర్యాల‌ను ప్ర‌భుత్వం స‌మ‌కూరుస్తోంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పథకాల అమలుకు నిధుల కోసం మద్యపాన ఆద

విజ‌య‌వాడ‌: మ‌ందు తాగే వారిని నీచంగా చూస్తాం గాని, మ‌న ప్ర‌భుత్వాల‌కు వాళ్ళే టాక్స్ పేయ‌ర్స్. వాళ్ళ నుంచి వ‌చ్చే ఆద‌యంతోనే ప‌బ్లిక్ కి అంటే మ‌న‌కు సౌక‌ర్యాల‌ను ప్ర‌భుత్వం స‌మ‌కూరుస్తోంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పథకాల అమలుకు నిధుల కోసం మద్యపాన ఆదాయాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. తమ బడ్జెట్ లలో ఐదింట ఒక వంతు నిధులు మద్యం ప్రియులే సమకూర్చుతున్నారు. మద్యనిషేధం లేని రాష్ట్రాలలో మద్యం వలన ఆదాయాలు కోట్ల రూపాయలలో ఉన్నాయి. అయితే, మందు బాబుల నుంచి ఆదాయం పిండ‌టంలో త‌మిళ‌నాట‌దే పైచేయిగా ఉంది. 
 
తమిళనాడు ‍29,672 కోట్ల రూపాయ‌ల ఆదాయం ఏటా పొందుతోంది. రెండో స్థానం హరియాణాది. ఆ రాష్ట్రం 19,703 కోట్లు పొందుతోంది. మహారాష్ట్ర - 18,000, కర్ణాటక - 15,332, ఉత్తరప్రదేశ్ 14,083 కోట్ల మ‌ద్యం ఆదాయాలు పొంతున్నాయి. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే, 12,739, తెలంగాణా - 12,144 కోట్లు మద్యంపై సంపాదిస్తున్నాయి. మధ్య ప్రదేశ్ - 7,926, రాజస్థాన్ - 5,585, పంజాబ్ - 5,000 కోట్ల‌తో ఆఖ‌ర్లో ఉన్నాయి.
 
అయితే మ‌ద్యం అమ్మ‌గానే సంబ‌డం కాదు... దానివ‌ల్ల పాడైన ప్ర‌జారోగ్యం విలువ ల‌క్ష‌ల కోట్ల‌లో ఉంటుంది. మద్యపానం వల్ల చెడిన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి మద్యం ఆదాయాన్ని మించి ఖర్చవుతుంది. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి రోగులను కార్పొరేట్ ఆసుపత్రులకు అప్పజెప్పిన ప్రభుత్వాలు ఈ ఖర్చును లెక్కించవు.