Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళనాడు రాజకీయ పరిణామాలు దేశానికి ప్రమాద సంకేతాలా..!

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (14:18 IST)

Widgets Magazine
ops - sasikala - vidyasagar

తమిళనాడులో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు పెనుప్రమాదంగా సంభవించే పరిణామాలుగా మారబోతున్నాయా? అనే అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ప్రజల్లో ఉన్న భావావేశాలను అవకాశంగా తీసుకుని కేంద్రం తమిళ రాజకీయాలలో జోక్యం చేసుకుంటున్న తీరు ప్రమాదకరం. జయలలిత మరణం దాని వెనుక ఉన్న అనుమానాలు, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్రంపై ఉంది.
 
జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ అవకాశం వచ్చినా రాజీ పడిన కేంద్రం ఇప్పుడు తనకు నచ్చిన సెల్వం దగ్గర నుంచి అధికారం దూరం అవుతుండటంతో గవర్నర్ కార్యాలయాన్ని వాడుకోవడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే శశికళ మీద ఉన్న కోపంతో నేడు ఈ ప్రక్రియను దేశం అంగీకరించితే భవిష్యత్ ప్రమాదకరం అవుతుంది. ఇకపై రాష్ట్రాలలో ఏ పార్టీకైనా నాధారణ మెజారిటీ వస్తే గవర్నర్ కారణం లేకుండా వారం, పది రోజులు మెజారిటీ ఉన్న పక్షాన్ని పిలువకపోతే ఖచ్చితంగా దాన్ని ప్రతిపక్షం అవకాశంగా తీసుకుని ఎన్నికైన శాసనసభ్యులను ప్రలోభ పెట్టి తనవైపు తిప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు.
 
ఫలితంగా ప్రజలు ఎన్నుకొన్నది ఒక పార్టీని అయితే ముఖ్యమంత్రి మాత్రం మరొకరు అవడానికి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. అంటే భవిష్యత్‌లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు లేకుండా రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రజలు మద్దతు ఉన్నా రాలేని దుష్ట సంప్రదాయం రావడానికి అవకాశం వస్తుంది. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఈ పరిణామం ప్రాణసంకటంగా అవుతుంది. నేడు దేశంలో ఫెడరల్ వ్యవస్థ పటిష్టంగా ఉంది అన్నా, కేంద్రంలో అధికారంలోకి వచ్చే జాతీయ పార్టీల నియంతృత్వ బావాలకు అడ్డుకట్ట వేయగలుతుందన్నా ఆ గొప్ప తనం ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలదే అవుతుంది.
 
అందులోను దక్షిణాది పార్టీల పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకే తమిళనాడులో జరుగుతున్న పరిణామాలపై అన్ని పార్టీలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు నోరు తెరవాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శశికళ మీద ఉన్న మంచి చెడ్డల ప్రాతిపదికన కాకుండా దేశ విశాల ప్రయోజనాల ప్రాతిపదికన ఆలోచించారు. ఇప్పటికే ఆలస్యం చేసిన గవర్నర్ మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉన్న శశికళను ప్రమాణ స్వీకారానికి అంగీకరించాలి. అనుమానం ఉంటే సభలోని అన్ని పార్టీల నేతలను తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై వారి పార్టీ అభిప్రాయాలను రాత పూర్వకంగా తీసుకుని శాసనసభ వేదికగా మెజారిటీ ఎవరికి ఉందో నిగ్గు తేల్చాలి. అది కూడా నిమిషం ఆలస్యం చేయకుండా నిర్ణయం ప్రకటించాలి. అలాంటి నిర్ణయం వచ్చే విధంగా ప్రజాస్వామ్య వాదులు అందరూ గలం విప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశం మరో చెడు సాంప్రదాయం వైపు వెళ్ళకుండా నిరోధించాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sasikala O Panneerselvam Tamilnadu Political Crisis

Loading comments ...

తెలుగు వార్తలు

news

అటవీశాఖలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. రూ. కోట్లు దండుకున్న ముఠా

ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలు వసూలు చేశారు ఓ ...

news

పన్నీర్ వెంట పాండ్యరాజన్‌.. గవర్నర్‌కు శశిలేఖ లేఖ.. ఇక ఆలస్యం చేయవద్దు.. సహనానికీ ఓ హద్దుంది..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ గవర్నర్ విద్యాసాగర్ లేఖ రాశారు. త‌మిళ‌నాడు ...

news

కవిత-బ్రాహ్మణి రావచ్చు..నేను రాకూడదా? చంద్రబాబు దమ్మున్న మగాడేనా?: రోజా ప్రశ్న

వైకాపా ఎమ్మెల్యే రోజాకు అవమానం జరిగింది. మహిళా పార్లమెంటేరియన్ సమావేశానికి ఆహ్వానించి, ...

news

వెలవెలబోయిన పోయెస్ గార్డెన్.. అమ్మను శశికళ కలవనివ్వలేదు.. జయ చిన్ననాటి స్నేహితులు

తమిళ రాజకీయాల్లో జయలలిత శకం ముగిసేదాకా పోయెస్ గార్డెన్‌లో కార్యాచరణ అంతా ఇక్కడి నుంచే ...

Widgets Magazine