Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జైల్లో పడ్డా గెలిచిన చిన్నమ్మ... 15 రోజుల్లో పళని ప్రభుత్వం పడిపోతుందా?

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (14:34 IST)

Widgets Magazine
palanai

జయలలిత సమాధిపై శశి కసిగా కొట్టిన దెబ్బ సాక్షిగా బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ తన పంతాన్ని నెగ్గించుకుంది. రాబోయే నాలుగున్నరేళ్ల కాలం అంతా 'చిన్న'అమ్మ కనుసన్నల్లోనే పాలన సాగనుంది. ఎలాగూ మూడున్నరేళ్లలో జైలు నుంచి శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని బయటపడుతారు కనుక మిగిలిన ఒక సంవత్సరమంతా ఆమె తన ఇంటి దగ్గర నుంచి పాలన సాగించే అవకాశం ఉంది. 
 
గురువారం సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న పళని స్వామి మంత్రివర్గం జాబితాను చిన్నమ్మ కూర్చిందేనని అంటున్నారు. ఈ జాబితాలో తన కుటుంబ సభ్యులకు చెందిన ఇద్దరికి కీలక మంత్రి పదవులను కట్టబెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు జయలలిత చరిష్మాతో నిలబడిన అన్నాడీఎంకే పార్టీని శశికళ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం ఆరోపిస్తోంది. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామనీ, అసలు అన్నాడీఎంకే జాతీయ కార్యదర్శి పదవికి శశికళ ఎంపిక కూడా చట్టబద్ధం కాదనీ, ఆ ప్రకారంగా చూసినప్పుడు ఆమె ఎంపిక చేసిన పళని స్వామి కూడా అనర్హుడంటూ వారు వాదిస్తున్నారు. పదవి స్వీకరించగానే సరిపోదనీ, ఆయన ప్రభుత్వం మనజాలదనీ, గవర్నర్ బలనిరూపణ లోపే ఆ ప్రభుత్వం కూలిపోతుందని వారు అంటున్నారు. శశికళ ఆదేశాలపై వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరి దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫూటుగా తాగిన ఫ్రెండ్స్.. డ్యాన్స్ చేసేందుకు నో చెప్పాడని స్నేహితుడినే చంపేశాడు..

ముంబై నగరంలో మహిళలపై అఘాయిత్యాలతో పాటు నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. తాను కోరిన పాటకు ...

news

చిన్నమ్మ ఎఫెక్ట్.. గూగుల్ రివ్యూలో కిందిస్థాయికి పడిపోయింది.. భద్రత నో అంటూ..?

చిన్నమ్మ శశికళ ఎఫెక్ట్‌తో గోల్డెన్ బే రెసార్ట్‌కు చెడ్డపేరొచ్చింది. ఒక్కసారిగా గోల్డెన్ ...

news

మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమో? జగన్ ప్రశ్న

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ ...

news

జయలలిత డెడ్ బాడీనే అపోలోకు వచ్చింది.. నాడీ పనిచేయలేదు.. డాక్టర్ రామసీత

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలున్నాయ్. ఆమె అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ...

Widgets Magazine