గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 మార్చి 2016 (16:50 IST)

టోపీ-శర్వాణీలపై స్పీచ్ అసదుద్దీన్‌కు జావేద్ కౌంటర్: భారత్ మాతాకీ జై అన్న తస్లీమా!

టోపీ-శర్వాణీలపైనే అసదుద్దీన్‌కు కోపమొస్తే.. జావేద్ అక్తర్ స్పీచ్‌పై తస్లీమా.. భారత్ మాతాకీ జై!

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఓవైసీ సోదరులు ముందుంటారు. గతంలో అక్బరుద్ధీన్ ఓవైసీ సెన్సేషనల్ కామెంట్స్ చేసి కేసులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుతం దేశానికి సంబంధించిన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. తాము అనుకున్నది మాట్లాడేయటం, ఇతరుల మనోభావాలని ఇబ్బంది పెడుతుందని ఆలోచించకపోవడం మజ్లిస్ వారి లెక్క. 
 
ఎంత గట్టిగా మాటలతో ఎదుటివారిని, దేశంలో వీలైనంత ఎక్కువ మందిని హర్ట్ చేయగలమా అనేది చూసుకుని అలా మాట్లాడేయడం వారి పరిపాటి అయ్యింది. ఈ క్రమంలో భరత్ మాతా కీ జై అనే మాట చెప్పను అంటూ బహిరంగంగా ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ మాటలపై ప్రస్తుతం తీవ్రఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. అసదుద్దీన్‌పై అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా అసద్‌ని విమర్శించడంలో బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ అందరికంటే ముందున్నారు. రాజ్యసభలో మాట్లాడుతూ షెర్వాణీ, టోపీ పెట్టుకోవాలి అని రాజ్యాంగం చెప్పిందా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఈ వ్యాఖ్యల మీద మజ్లిస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అవి ముస్లింల పద్ధతి అని అలాంటి వ్యాఖ్యలు వారి మనోభావాలని గాయపరుస్తాయన్నారు. 
 
టోపీ-శర్వాణీ గురించి మాట్లాడితేనే అసదుద్దీన్‌కు అంత కోపం వస్తే.. వందల కోట్ల భారతీయులు గౌరవించే విషయాల మీద అసదుద్దీన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వారు కూడా ఫీల్ కారా అంటూ ప్రశ్నించారు. అది కూడా ఆయన తెలుసుకోకపోతే ఎలా అంటూ నిలదీశారు. కాగా.. జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్ ట్విట్టర్లో స్పందించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ స్పీచ్ అదిరిందని వెల్లడించింది. అసదుద్దీన్ వ్యాఖ్యల్ని ఆమె తప్పుబట్టింది. అంతేకాకుండా భారత్ మాతాకీ జై అంటూ తన ట్వీట్ సందేశాన్ని ముగించింది.