Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేవలం మూడు రోజుల్లో పాస్‌పోర్టు...

మంగళవారం, 30 జనవరి 2018 (13:12 IST)

Widgets Magazine
Indian Passport

ఇకపై కేవలం మూడు రోజుల్లోనే పాస్‌పోర్టును జారీచేయనున్నారు. ఈ మేరకు తాత్కాల్ పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 
 
సాధారణ పద్ధతిలో అయితే పాస్‌పోర్టు జారీకి 10 రోజులు పడుతుంది. దీంతో అత్యవసరంగా పాస్‌పోర్టు కావాల్సినవారు తత్కాల్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే, పాస్‌పోర్టు జారీల విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండటంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపి తత్కాల్‌ దరఖాస్తు ప్రక్రియలో మార్పులు చేసిందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి(ఆర్పీవో) విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. 
 
ఈ సరికొత్త ప్రక్రియలో భాగంగా, దరఖాస్తు చేసుకొనే వ్యక్తి స్వీయ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్‌ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ ఏవైనా రెండురకాల పత్రాలు(ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, విద్యార్థి ఫొటో ఐడీకార్డు, పాన్‌కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్‌ పొదుపు ఖాతా పుస్తకం, పింఛన్‌ డాక్యుమెంట్‌) దరఖాస్తుదారులు సమర్పించాలి. అన్నీ సక్రమంగా ఉంటే రెండు, మూడ్రోజుల్లో పాస్‌పోర్టును జారీచేస్తారు. 
 
ఈ కొత్త విధానం ద్వారా పోలీసు వెరిఫికేషన్‌కు ముందుగానే పాస్‌పోర్టు జారీచేసి, ఆ తర్వాత పోలీస్ తనిఖీ చేస్తారు. అలాగే, ఈ విధానం కింద పాస్‌పోర్టు పొందాలనుకునేవారు కూడా అదనపు చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు కూడా. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇంజిన్‌లో టెక్నికల్ సమస్య... రోడ్డుపై ల్యాండైన విమానం (వీడియో)

విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఓ విమానం నడిరోడ్డుపై ల్యాండైంది. ఈ ఘటన కాలిఫోర్నియాలో ...

news

అరెస్టు చేయించి సెల్‌లో వేయిస్తాం.. నిత్యానందకు కోర్టు వార్నింగ్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు మద్రాసు హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ...

news

మహాత్ముడికి రాష్ట్రపతి - ప్రధాని, ఇతర నేతలు నివాళులు

మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు ...

news

అందాన్ని చూపించేలా దుస్తులు ధరిస్తే అత్యాచారం చేయమని ఆహ్వానించినట్టే : మహిళా టీచర్

ఇటీవలికాలంలో అమ్మాయిల వస్త్రధారణపై వివిధ రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ...

Widgets Magazine