Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేయసి మోసం చేసింది.. జీవితంపై విరక్తి.. టెక్కీ ఆత్మహత్య.. నిద్రొస్తుందని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి?

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (15:00 IST)

Widgets Magazine
Hang

గత వారం పూణేలోని ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న లేడీ టెక్కీ రసిలా రాజు (24) ఆమె పని చేస్తున్న కార్యాలయంలోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత డిసెంబర్ నెలలో పూణేలో తను పని చేస్తున్న కార్యాలయంలోనే మరో టెక్కీ ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా జీవితంపై విరక్తిని పెంచుకున్న ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పూణే నగరంలో చోటుచేసుకుంది. 
 
ఇందుకు కారణం కూడా ప్రేమేనని తేలింది. ప్రేమలో విఫలం కావడమే టెక్కీ ఆత్మహత్యకు కారణమైందని పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన అభిషేక్ కుమార్ (23) అనే యువకుడు.. పూణేలోని రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్కులోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 
 
ఇతను ప్రేమలో విఫలం కావడంతో నెల రోజుల పాటు స్నేహితులతో కలిసిమెలసి ఉండలేకపోయాడు. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించేవాడు ఈ క్రమంలో అభిషేక్.. తన స్నేహితులతో కలిసి వుంటున్న అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిద్రొస్తుందని వెళ్లి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన అభిషేక్‌ చాలాసేపటికి తలుపులు తెరవకపోవడంతో కిటికీల నుంచి చూశామని.. అప్పటికే అభిషేక్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడని స్నేహితులు అన్నారు. 
 
కానీ అతనిని కాపాడేలోపే జరగాల్సిన అనర్థం జరిగిపోయిందని స్నేహితులు వాపోయారు. ఇంకా ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే అభిషేక్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో అభిషేక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు అతని స్నేహితులు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫేస్ బుక్ పరిచయం... ప్రియుడికోసం లేచి వచ్చేసింది... పెళ్లితో ఆ సుఖం తీర్చుకుని పాతేశాడు...

ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మి వచ్చిన మహిళను అత్యంత కిరాతకంగా ...

news

అరుదైన హెర్నియా ఆపరేషన్.. పురుషుని కడుపులో స్త్రీ జననాంగాలు, గర్భసంచి..!

నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య నిపుణులు గురువారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ...

news

డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన వారం రోజుల్లోనే లక్ష వీసాలు రద్దు.. ప్రభుత్వ అటార్నీ

ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ...

news

గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్.. విజయం మాదేనన్న మనోహర్ పారికర్

పంజాబ్, గోవా రాష్ట్రాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ...

Widgets Magazine