బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2015 (11:21 IST)

Shakespeare స్పెల్లింగ్ చెప్పమని కోరగా.. "s-h-a-k-s-p-e-a-r" అని?

పదో తరగతి పరీక్షలు జరుగుతుంటే.. తమ వారికి చిట్టీలు అందించేందుకు వందలాది మంది కిటీకీలెక్కిన దృశ్యాలు గుర్తుండే ఉంటాయి. ఎలాగోలా పరీక్షల ప్రహసనాన్ని ముగించిన అధికారులు మూల్యాంకనం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. బీహార్లోని సహస్ర జిలాలో విద్యార్థుల ఆన్సర్ పేపర్లు దిద్దుతున్న వారికి కనీస పరిజ్ఞానం లేదని తెలుస్తోంది.
 
10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ దిద్దుతున్న ఒక టీచర్‌ను 'Shakespeare' స్పెల్లింగ్ చెప్పమని కోరగా, ఆయన ఆలోచిస్తూ, "s-h-a-k-s-p-e-a-r" అని చెప్పాడు. ఇక లెక్కల పేపర్ దిద్దుతున్న టీచర్ ను 'Mathematics' స్పెల్లింగ్ చెప్పమని కోరగా, ఆయన "M-a-t-h-m-a-t-e-s." అని సమాధానం ఇచ్చాడు. ఈ వ్యక్తి ఒక హై స్కూల్ లో 9వ తరగతికి లెక్కలు చెపుతారట.