గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (11:05 IST)

లాలూ-కేజ్రీవాల్ ఆలింగనంలో తప్పులేదు.. అది మా సంప్రదాయం: తేజస్వీ యాదవ్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆలింగనం చేసుకోవడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో తన ప్రమేయం లేదని ఆయన ఆలింగనం చేసుకున్నారని కేజ్రీవాల్ సైతం వివరణ ఇచ్చారు. తాజాగా ఈ వ్యవహారంపై బీహార్ డిప్యూటీ సీఎం, లాలూ పుత్రరత్నం తేజస్వీ తనదైన శైలిలో స్పందించారు. ఆలింగనం చేసుకోవడం తమ సంస్కారమంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఎవరెన్ని మాటలు మాట్లాడినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. తమ వేడుకకు వచ్చిన అతిథిని ఆలింగనం చేసుకోవడం సంప్రదాయమన్నారు. దీన్ని తప్పు పట్టాల్సిన పనంటూ లేదన్నారు. 
 
కాగా బీహార్‌లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాలూ ఆయన్ని దగ్గరికి పిలిచి ఆలింగనం చేసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అవినీతికి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన లాలూను... అవినీతిని అంతమొందిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీ ఎలా ఆలింగనం చేసుకుంటారంటూ నెటిజన్లు సెటైర్లు విసరడంతో.. లైన్లోకి వచ్చిన కేజ్రీవాల్ లాలూ తనను ఆలింగనం చేసుకున్నారని చెప్పారు. దీనిపై తేజస్వీ ప్రస్తుతం క్లారిటీ ఇచ్చారు.