శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (12:02 IST)

తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవి దున్న: కేసీఆర్ కోసం వెయిటింగ్!

తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర జంతువుగా "అడవి దున్న''ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింకను ఎంపిక చేసిన నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర జంతువుగా ‘అడవి దున్న’ (ఇండియన్ బైపన్) ఎంపికైంది. 
 
కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్)ని ఖరారు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర చెట్టుగా ఇప్పచెట్టును, రాష్ట్ర పుష్పంగా మోదుగుపువ్వును ఎంపిక చేశారు.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర జంతువుగా అడవి దున్నను ఖరారు చేస్తూ దీనికి సంబంధించిన ఫైలు మీద తెలంగాణ అటవీ, పర్యావరణ మంత్రి సంతకం చేసి సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపించారు. సింగపూర్ పర్యటన నుంచి కేసీఆర్ తిరిగిరాగానే ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది.