Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్.. తెలుగు ప్రజలు ఫూల్స్ కాదు : టీడీపీ

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (09:09 IST)

Widgets Magazine
tdp logo

'మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌! సభా వేదిక నుంచి డిమాండ్‌ చేస్తున్నా! విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పండి! సమగ్ర వివరణ ఇవ్వండి! లేదంటే... మీరు ఏపీ పట్ల దురుద్దేశంతో ఉన్నారని భావించక తప్పదు. మేం ఇంకా మీతో బంధం ఎందుకు కొనసాగించాలనే విషయంపై పునరాలోచించక తప్పదు' అంటూ లోక్‌సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నిలదీశారు. 
 
సుమారు 14 నిమిషాలపాటు ఆంగ్లంలో అనర్ఘళంగా చేసిన ప్రసంగంలో ప్రధాని, ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'కొంత మందిని ఎప్పుడూ మోసం చేయవచ్చు. కొంత మందిని అప్పుడప్పుడు మోసం చేయవచ్చు. కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేరు. ఏపీ ప్రజలు కానీ, టీడీపీ కానీ మోసపోయే వారి జాబితాలో ఉండరు' అంటూ తేల్చి చెప్పారు. 
 
'రాష్ట్ర విభజన చట్టాన్ని ఆమోదించిన కాంగ్రెస్‌కు ఏపీ ప్రజలు సున్నా సీట్లు ఇచ్చారు. మరి... ఆ చట్టంలోని అంశాలను కనీసం అమలు చేయని బీజేపీ సంగతి ఏమిటో ఆలోచించండి. వీటన్నింటిపై మీ వివరణ డిమాండ్‌ చేస్తున్నాం. లేనిపక్షంలో... మీరు మా రాష్ట్రం పట్ల 'దురుద్దేశం' (బ్యాడ్‌ ఫెయిత్‌)తో ఉన్నారని భావించి... ఈ బంధం ఎందుకు కొనసాగించాలి? అనే అంశంపై ఆలోచించక తప్పని పరిస్థితి వస్తుందని సభా ముఖంగా బీజేపీ అగ్రనేతలకు తేల్చి చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
తెలుగుదేశం పార్టీ భారత పార్లమెంటు నరేంద్ర మోదీ Fools Parliament Telugu People Tdp Mp Galla Jaydev Pm Narendra Modi

Loading comments ...

తెలుగు వార్తలు

news

రేణుకా చౌదరిని మోదీ ఇలా అనేశారే? రామాయణం తర్వాత ఆ నవ్వును..?

''ట్రిపుల్ తలాక్'' బిల్లు ఓ ఒక్క కమ్యూనిటినో ఉద్దేశించినది కాదని.. ఇదే నేరం కింద హిందూ ...

news

మీరిచ్చిన నిధుల కంటే.. 'బాహుబలి' కలెక్షన్లే అధికం : గల్లా జయదేవ్

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కడిగిపారేశారు. అడ్డగోలు విభజన ...

news

బంద్‌కు జనసేన మద్దతు: విరమించండి, పార్లమెంట్‌లో కలసి రండంటున్న మంత్రులు

అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని వామపక్షాలు ఇచ్చిన రాష్ట్ర ...

news

హక్కుల సాధన కోసం జేఏసీ... పోటీ చేయకపోవడం బాధేస్తోంది : పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం సంయుక్త కార్యాచరణ కమిటీ (జాయింట్ యాక్షన్ కమిటీ)ని ...

Widgets Magazine