శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (17:02 IST)

ఎల్కే.అద్వానీ ఔట్ : భారత రాష్ట్రపతి ఎన్డీయే అభ్యర్థిగా థావర్ చంద్ గెహ్లాట్?

భారత రాష్ట్రపతి రేస్‌లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సరికొత్త పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో ఆ స్థానంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీని

భారత రాష్ట్రపతి రేస్‌లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సరికొత్త పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో ఆ స్థానంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీని ఎన్నుకోవచ్చన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే, రాష్ట్రపతి రేసులో తాను లేనంటూ అద్వానీ ఇటీవల ప్రకటించారు. దీంతో సరికొత్త పేరు తెపైకి వచ్చింది. 
 
కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్‌ను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గెహ్లాట్‌కు ఆర్ఎస్ఎస్‌ నేతలతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనను రాష్ట్రపతిని చేస్తే, దళితుల ఓట్లను కొల్లగొట్టవచ్చనేది బీజేపీ ఎత్తుగడగా ఉంది. అయితే, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ప్రధాని నరేంద్ర మోడీ మాటే ఫైనల్ కానుంది