గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (12:55 IST)

థానే రైల్వే స్టేషన్‌లో తొలి ఏసీ టాయిలెట్!

థానే రైల్వే స్టేషన్‌లో తొలి ఏసీ టాయి‌లెట్‌ను భారత రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. దీన్ని శనివారం రైల్వే ఉన్నతాధికారులు ప్రారంభించనున్నారు. ఇందులో పురుషుల విభాగంలో 30 యూరినల్స్, 4 లెట్రిన్లు... మహిళలకు 6 వాటర్ క్లోజెట్ సెక్షన్లను ఏర్పాటు చేశారు. 
 
అలాగే, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. కాగా, దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో థానే ఒకటి. అలాంటి రైల్వే స్టేషన్‌లో కేవలం మూడంటే మూడే రైల్వే స్టేషన్లు ఉన్నాయి. తదుపరి, ఏసీ టాయిలెట్ సౌకర్యాన్ని డోంబివ్లి స్టేషన్లోనూ ఏర్పాటు చేస్తామని ఓ రైల్వే అధికారి తెలిపారు.