బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2014 (16:17 IST)

ఆన్‌లైన్ మార్కెట్లో చోరీకి గురైన వస్తువులు.. వామ్మో జాగ్రత్త..!!

మీరేదైనా వస్తువును అమ్మాలనుకుంటున్నారా.. అయితే సైట్లో వస్తువుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేయండి.. చిటికెలో అమ్ముకోండి.. అంటూ ఇంటర్నెట్లో యాడ్స్ చూస్తుంటాం. కానీ ఆన్ లైన్ ట్రేడింగ్ చాలా డేంజరని తేలింది. 
 
ఆన్‌లైన్ మార్కెట్లో ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ వస్తువులకు బదులు... చోరీకి గురైన వస్తువులు దర్శనమిస్తున్నాయట. దొంగలు ఇప్పుడు తాము చోరి చేసిన వస్తువులను షాపుల్లో అమ్మకుండా, ఇలా, ఆన్ లైన్‌లో పెట్టేసి ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారని చత్తీస్ గఢ్ పోలీసులు చెబుతున్నారు. 
 
చోరీ చేసిన మొబైళ్ళ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వారు ఓఎల్ఎక్స్.ఇన్ వంటి ఆన్ లైన్ ట్రేడింగ్ సైట్లలో అమ్మకానికి పెడుతున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.