గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2016 (16:53 IST)

ఈ ఫేస్ బుక్ ఫోటో చూస్తే.. చివరిసారిగా ఆత్మీయ స్పర్శ... తొండాలను సాచి...? (ఫోటో)

ఏనుగు అడవిలో ఉంటే గజరాజు. అదే మనుషుల ప్రదేశానికి వచ్చేస్తే మాత్రం మానవుడికి సేవలు చేసే ఆయుధంగా మారిపోతుంది. మనుషులకే స్నేహం, ప్రేమ వంటి ఆప్యాయతలు ఉంటాయని.. అడవి జంతువుల్లో అవి వుండవని అందరూ అనుకుంటారు

ఏనుగు అడవిలో ఉంటే గజరాజు. అదే మనుషుల ప్రదేశానికి వచ్చేస్తే మాత్రం మానవుడికి సేవలు చేసే ఆయుధంగా మారిపోతుంది. మనుషులకే స్నేహం, ప్రేమ వంటి ఆప్యాయతలు ఉంటాయని.. అడవి జంతువుల్లో అవి వుండవని అందరూ అనుకుంటారు. కానీ తమకూ ప్రేమ ఆప్యాయత ఉందని గజరాజులు నిరూపించాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే..? రెండు వేరువేరు ట్రక్కుల్లో భిన్న గమ్యాలకు ప్రయాణమైన రెండు ఏనుగులు చివరి ఆత్మీయ స్పర్శకోసం తొండాలు సాచి అందంగా పెనవేసుకున్నాయి. మనం విడిపోతే చేతులు కలుపుకుని స్పృశించుకునే విధంగా ఏనుగులు తొండాలను స్పృశించుకుని ఫోటోను చూసే అందరి మనుషుల మనస్సును కలచివేశాయి. 
 
మనసు కదిలించేలా ఉన్న ఈ ఫొటోను బెంగళూరుకు చెందిన సౌమ్య విద్యాధర్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 'ఓ హైవే మీద తీసిన ఫొటో ఇది. కొత్త యజమానులకు సేవ చేయడానికి ఈ రెండు ఏనుగులు కొత్త దారులంట వెళ్తూ.. చివరిగా ఇలా ప్రేమగా పలకరించుకుంటున్నాయి. ఈ ఫొటో నా హృదయాన్ని కదిలించింది' అని ఆమె పోస్ట్‌ చేశారు.
 
ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్‌, లైకులు, షేర్లు చేస్తున్నారు. జంతువుల్ని బలవంతంగా తరలించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కామెంట్స్‌ చేయగా, ఈ చిత్రం మనసును కదిలించిందని మరికొందరు అంటున్నారు.