గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (11:02 IST)

వర్షం జాడ కనిపెట్టే కేరళ వాసి... ఎలా?

ఓ వ్యక్తి వర్షం జాడ(రాక)ను ఇట్టే కనిపెట్టేస్తున్నాడు. అదీకూడా గత 34 యేళ్ళుగా ఖచ్చితంగా వర్షం రాకను పసిగట్టి స్థానిక రైతులకు చేరవేస్తున్నాడు. అతని పేరు విమల్ కుమార్. కేరళ వాసి. వయనాడు అనే ప్రాంతంలో 30

ఓ వ్యక్తి వర్షం జాడ(రాక)ను ఇట్టే కనిపెట్టేస్తున్నాడు. అదీకూడా గత 34 యేళ్ళుగా ఖచ్చితంగా వర్షం రాకను పసిగట్టి స్థానిక రైతులకు చేరవేస్తున్నాడు. అతని పేరు విమల్ కుమార్. కేరళ వాసి. వయనాడు అనే ప్రాంతంలో 30 ఎకరాల కాఫీ తోట యజమాని. కాఫీ తోటల పెంపకంలో వర్షం పాత్ర చాలా కీలక కావడంతో ఆయన వర్షం రాకను కనిపెట్టే పరికరాన్ని స్వయంగా కనుగొన్నారు.
 
ఈపరికరం ద్వారా భార‌త వాతావ‌ర‌ణ కేంద్రానికే కొన్ని సార్లు వాతావ‌ర‌ణ శాఖ‌కే విమ‌ల్‌ మార్గ‌ద‌ర్శ‌కం చేశాడు. కేవ‌లం ఒక ప‌రీక్ష‌నాళిక‌తో త‌యారు చేసిన రెయిన్‌గేజ్‌ను ఉప‌యోగించి 34 ఏళ్లుగా వ‌ర్షం రాక‌ను క‌చ్చితంగా క‌నిపెట్టేస్తున్నాడు విమ‌ల్‌.
 
ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల‌కే త‌న రెయిన్‌గేజ్ రీడింగ్స్‌ను బుక్‌లో రాసుకుంటాడు. వాటి ఆధారంగా వ‌ర్షం తీవ్ర‌త‌ను, స్థాయిని గుర్తించి తోటి కాఫీ రైతుల‌కు చెబుతుంటాడు. ఆయ‌న చెప్పిన విష‌యం గ‌త 34 ఏళ్ల‌లో ఏ రోజు కూడా త‌ప్పు కాలేద‌ని అక్క‌డి రైతులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.