మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: గురువారం, 5 మార్చి 2015 (05:53 IST)

చంపే సమయమొచ్చింది... ‘అన్నా’కు బెదిరింపు

సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే చేస్తున్న భూసంస్కరణల వ్యతిరేక ఉద్యమం వేడి పుట్టిస్తోంది. అధికార పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతోంది. అన్నాహజారేను చంపేస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. అదే విధంగా ఆయన అనుచరులకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఉద్యం చేపట్టాడు.  ఇది కొందరిలో సహజంగానే కొందరు అరిగించుకోలేకపోతున్నారు. అందుకే ఫేస్‌బుక్ ద్వారా బెదిరింపు సందేశాలు మొదలు పెట్టారు.  అన్నా హజారేను చంపే సమయం వచ్చింది. నేనే కాబోయే నాథూరామ్ గాడ్సే అని కెనడా ఎన్నారై గగన్ విధు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. 
 
దీనిపై హజారే ఆఫీసు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు గగన్‌తో పాటు అతనికి సహకరించిన నీల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే, హజారే భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఫేస్‌బుక్ సందేశం వచ్చిన కంప్యూటర్ ఐపీ అడ్రస్ కనుగొనడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అన్నా మద్దతుదారుడు అశోక్ గౌతమ్‌కు కూడా బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఉద్యమం వేడి పుట్టిస్తోంది.