Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆప్ ఎమ్మెల్యేలు మామూలోళ్లు కాదు.. అసెంబ్లీలోనే కానిచ్చేశారు...

శనివారం, 8 జులై 2017 (13:31 IST)

Widgets Magazine
Police

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోనే పలువురు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈ కేసులు నమోదు చేశారు. 
 
గత నెల 28న అసెంబ్లీకి హాజరయ్యేందుకు వెళ్లిన 35 ఏళ్ల పార్టీ మహిళా కార్యకర్తపై ఆప్ ఎమ్మెల్యేలు జర్నల్ సింగ్, అమానుతుల్లా ఖాన్, సోమ్‌నాథ్ భారతీలు కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓ గదిలో ఆమెను బంధించి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత మహిళ ఆ తర్వాతి రోజు పోలీసులకు వారిపై ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది. 
 
అమానుతుల్లా ఖాన్ తనను నేలపై పడదోసి పట్టుకుంటే జర్నల్ సింగ్ తన పొట్టపై పిడిగుద్దులు కురిపించాడని ఆరోపించింది. దాదాపు అరగంట పాటు వారి వికృత చర్య కొనసాగిందని తెలిపింది. దీంతో ఆ ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైంగిక వేధింపులు, భౌతిక దాడి, అక్రమ నిర్బంధం తదితర ఆరోపణలపై వారిపై కేసులు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వైఎస్ఆర్ జయంతి.. ఇడుపులపాయలో జగన్, విజయమ్మ ఘన నివాళి

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి వేడుకలు శనివారం రాష్ట్ర ...

news

కట్టుకున్న భర్తను వద్దని ప్రియుడిని పెళ్ళాడిన భార్య.. దగ్గరుండి పెళ్లి చేసిన మాజీ భర్త

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని ప్రియుడిని పెళ్లి చేసుకుందో భార్య. పైగా, ఈ పెళ్లి ...

news

జగన్ తీరేంబాగోలేదు... అరెస్టు చేస్తామంటున్న సీబీఐ.. ఎందుకు?

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరు ఏమాత్రం బాగోలేదని సీబీఐ అధికారులు అంటున్నారు. ఆయన ...

news

లైంగిక దాడి పేరు చెబితే పోలీసులు సత్వరం స్పందిస్తారనీ... ఆ పని చేసిన మహిళ

ఓ మహిళ తన భర్త నుంచి తనను తాను కాపాడుకునేందుకు పోలీసులకు చుక్కలు చూపింది. లైంగికదాడి ...

Widgets Magazine