శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (13:17 IST)

బెంగళూరులో గ్యాంగ్ రేప్.. అర్థనగ్నంగా పరుగులు!

బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి పైన బెంగళూరు తావరకెరె ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి సామూహిక అత్యాచారం జరిగింది. ఈ యువతి బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బెంగళూరు నుండి విజయనగర వైపు వెళ్లడానికి బస్టాండు వద్ద వాహనం కోసం ఎదురు చూస్తోంది. 
 
ఓ కారు డ్రైవర్ తాను తీసుకు వెళ్తానని నమ్మబలికాడు. ఆమె వాహనం ఎక్కేసరికి అందులో మరో వ్యక్తి ఉన్నాడు. కారు విజయనగరలో ఆగకుండా సమీపంలోని తిప్పనగుండనహళ్లి వైపు వెళ్తున్న విషయాన్ని ఆమె గుర్తించి, అడిగింది. దీంతో వాహనంలో ఉన్న మరో వ్యక్తి, డ్రైవర్ ఆమెను కట్టి పడేశారు. సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకు వెళ్లి తోటమాలితో కలిసి అత్యాచారం చేశారు. 
 
తెల్లవారుజామున ఆమె వారి నుండి తప్పించుకొని అర్ధనగ్నంగా పరుగులు తీసింది. ఆమె అర్ధనగ్నంగా ఒక కిలోమీటర్ దూరం పరుగెత్తింది. స్థానికుల సహాయంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.