శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 మార్చి 2017 (15:32 IST)

మాకంటూ ఎవరూ లేరు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం... పుదుచ్చేరి వాసుల సూసైడ్ లేఖ

కర్నూలు జిల్లా మంత్రాలయం మఠంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముగ్గురిని పుదుచ్చేరి వాసులుగా గుర్తించారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో పాండిచ్చేరికి చెందిన శరణన్‌ (42), అతడి చెల్లెలు శాంతి (28), చెల

కర్నూలు జిల్లా మంత్రాలయం మఠంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముగ్గురిని పుదుచ్చేరి వాసులుగా గుర్తించారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో పాండిచ్చేరికి చెందిన శరణన్‌ (42), అతడి చెల్లెలు శాంతి (28), చెల్లెలు కూతురు పవిత్ర (12)లు ఉన్నారు. 
 
స్థానిక పోలీసుల వివరాల మేరకు... ఈనెల 24వ తేదీన మంత్రాలయంకు వచ్చిన ఈ ముగ్గురు మఠానికి చెందిన వీవీజీ వసతిగృహంలో 52 నెంబర్‌ గదిని అద్దెకు తీసుకున్నారు. మూడురోజుల నుంచి గదిని తెరవకపోవడం, గది నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
సీఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని గదిని తెరిచి చూడగా ముగ్గురూ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మృతులు రాసిన సూసైడ్‌ లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 
 
మా కుటుంబంలో అందరూ చనిపోవడంతో మనస్థాపం చెంది తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాశారు. తమకంటూ ఎవరూ లేనందున మంత్రాలయంలోనే దహన సంస్కారాలు నిర్వహించాలని సూసైడ్‌ లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.