గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 23 మే 2015 (09:27 IST)

బాలుడిపై పులి పంజా... శరీరం చిన్నాభిన్నం

అభంశుభం తెలియని పసిపిల్లాడు. తన ఎదురుగా ఉన్నది పులో... పిల్లో కూడా తెలుసుకునే వయసు లేదు. ఇలాంటి పరిస్థితులలో నిజంగానే ఓ పులి పాపం ఎదుటకు వచ్చింది. ఇక అంటే ఆ బాలుడిపై తన పదునైన పంజా విసిరింది. అమ్మా.. అమ్మా..అంటున్నా కన్నతల్లి వచ్చే లోపే పులి బాలుడిని చిన్నాభిన్నం చేసింది. ఈ సంఘటన బీహార్లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. 
 
బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెరిహండీ గ్రామ పరిధిలో చిన్నారి బబ్లూ ఆటలాడుకుంటున్నాడు. ఆ క్రమంలో బబ్లూపై పులి ఆకస్మాత్తుగా దాడి చేసి చంపేసింది. అనంతరం అతడి శరీరాన్ని చిన్నచిన్న ముక్కలుగా చిన్నాభిన్నం చేసింది. దాంతో గ్రామస్తులు, పార మిలటరీ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 
 
అయితే వాల్మీకి నేషనల్ పార్క్లో పులుల సంఖ్య గత మూడేళ్ల కాలవ్యవధిలో రెండింతలు అయ్యాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్క్ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం మృతి చెందిన బబ్లూ కుటుంబానికి రూ. 2 లక్షలు నష్ట పరిహారం అందజేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.