Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళకు మరో షాక్... పన్నీర్ సెల్వం గూటికి మరో ఎంపీ... పెరుగుతున్న వలసలు

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (22:12 IST)

Widgets Magazine
opanneer

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకేకు చెందిన తిరువణ్ణామలై లోక్‌సభ సభ్యురాలు ఆర్.వానరోజా శనివారం రాత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు జై కొట్టారు. స్థానిక గ్రీన్‌వేస్ రోడ్డులో ఉన్న సీఎం అధికారిక నివాసంలో శనివారం రాత్రి కలుసుకుని ఆయనకు మద్దతు ప్రకటించారు. దీంతో పన్నీర్ పంచన చేసి అన్నాడీఎంకే లోక్‌సభ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరగా, ఒక రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ ఉన్నారు. 
 
మరోవైపు... శనివారం మరో ఇద్దరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. వీరిలో ఒకరు మంత్రి కాగా, మరొకరు చెన్నై మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ ఆర్.నటరాజన్ ఉన్నారు. అలాగే, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, ఎమ్మెల్యే, నటుడు ఆర్.శరత్ కుమార్ కూడా పన్నీర్‌కు అండగా నిలించారు. 
 
అలాగే, పార్టీ కోశాధికారిగా కొత్తగా శశికళ నియమించిన దిండిగల్ శ్రీనివాసన్‌ కూడా పన్నీర్‌కు జైకొట్టినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే కోశాధికారిగా ఉన్న పన్నీర్ సెల్వంను ఆ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో దిండిగల్ శ్రీనివాసన్‌ను నిమించారు. అయితే శ్రీనివాసన్ ఇవాళ సెల్వంకు మద్దతు ప్రకటించి శశికళకు పెద్ద ఝలక్ ఇచ్చాడు.
 
మరోవైపు ఆలస్యమవుతున్నా కొద్దీ ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతుండడంతో శశికళ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకునే పనిలో పడ్డారు. వీలైనంత త్వరగా ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్ ముందు పరేడ్ నిర్వహించాలని శశికళ భావించాలని ప్రయత్నించినప్పటికీ ఆ వ్యూహం కూడా ఫలించలేదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొరకరాని కొయ్యలా పన్నీర్ సెల్వం... శశికళ చేసిన తప్పులు ఇవే... ఆశలు గల్లంతే

నిన్నటివరకు తనకు వంగివంగి నమస్కారాలు చేసిన ఓ.పన్నీర్ సెల్వం ఇపుడు కొరకరాని కొయ్యలా ...

news

పన్నీర్‌కు శరత్ కుమార్ మద్దతు.. ఆ వర్గంలో చేరితే తినే కూరల్లో ఉప్పు ఉందా? అని అడుగుతారు

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు రాజ్యసభ సభ్యుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే ...

news

శశికళకు కంట్లో నలుసుగా మారిన పన్నీర్.. మిస్డ్ కాల్ సర్వేలో ''అన్న''దే పైచేయి..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం కంట్లో ...

news

ఎమ్మెల్యేలతో కవాతుకు చిన్నమ్మ ప్లాన్.. శశికళకు అపాయింట్‌మెంట్ ఇవ్వని గవర్నర్

తమిళనాట రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్ర సీఎం పదవి కోసం శశికళ, పన్నీర్ సెల్వంల మధ్య ...

Widgets Magazine