Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళనాడుకు ఇదేమి కొత్తకాదు.. మంచి నిర్ణయమే తీసుకుంటారు : కె. రోశయ్య

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:08 IST)

Widgets Magazine
rosaiah

తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం వంటి సంఘటనలు కొత్తేమి కాదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై రోశయ్య హైదరాబాద్‌లో స్పందిస్తూ... ‘ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా గవర్నరు నిర్ణయాలు తీసుకుంటారు. తమిళనాడుకి ఇదేమి కొత్తకాదు. ఈ సమస్యను విద్యాసాగర్‌రావు చక్కగా పరిష్కరిస్తారు. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, మహారాష్ట్రకు గవర్నర్‌గా పనిచేస్తున్నారన్నారు. 
 
ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అయితే, జరుగుతున్నది మంచా చెడా అనేది నేను చెప్పలేను. మరికొద్ది గంటలు వేచి ఉంటే నిర్ణయం తెలుస్తుంది. నిర్ణయం ప్రకటించాక పరిస్థితి అంతా సద్దుమణుగుతుందని రోశయ్య అభిప్రాయపడ్డారు. కాగా, తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో గురువారం రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సమావేశమై తమతమ వాదనలు వినిపించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sasikala O Panneerselvam Ch Vidyasagar Rao Tamil Nadu Political Crisis Tn Ex Governor K Rosaiah

Loading comments ...

తెలుగు వార్తలు

news

రెండు రోజుల్లో శశికళ కథ సమాప్తం : సీఎం పన్నీర్ వర్గం నేత పాండ్యన్

తమిళనాడులో శశికళ వ్యతిరేక వర్గం బలం పెరుగుతోంది. ఈ క్రమంలో, పన్నీర్ సెల్వం వర్గానికి ...

news

గవర్నర్‌తో పన్నీర్ భేటీ ఓవర్.. ధర్మమే గెలుస్తుందన్న ఓపీఎస్.. శశిపై స్టాలిన్ ఫైర్

తమిళనాట రాజకీయాలు హీటెక్కాయి. శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం వార్ జరుగుతోంది. తమ బలాన్ని ...

news

శశికళకు పన్నీర్ సెల్వం ఎలా చెక్ పెడుతున్నారు? పక్కా పొలిటికల్ లీడర్ ఎలా మారాడు?

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ. పన్నీర్ ...

news

అబ్బెబ్బే... మాకెలాంటి సంబంధం లేదు : టీఎన్ పాలిట్రిక్స్‌పై రాజ్‌నాథ్

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ...

Widgets Magazine