గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2016 (13:12 IST)

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కాంత్ అట్టర్ ఫ్లాప్.. కాంగ్రెస్‌తో చేతులు కలిపేస్తాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయిన డీఎండీకే అధినేత విజయ్ కాంత్ పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌తో భేటీ అయ్యారు. తద్వారా కాంగ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయిన డీఎండీకే అధినేత విజయ్ కాంత్ పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌తో భేటీ అయ్యారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ వైపు కెప్టెన్‌ను తిప్పుకునే దిశగా కాంగ్రెస్ కార్యాచరణ మొదలెట్టిందని తమిళనాడు రాజకీయ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వేసిన గాలానికి మెట్టు దిగని విజయ్ కాంత్.. ప్రస్తుతం మనసు మార్చుకున్నట్లున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ డీఎండీకే కార్యాలయానికి వెళ్లడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. గత వారం స్టాలిన్‌కు వ్యతిరేకంగా తిరునావుక్కరసర్ స్పందించిన తీరు డీఎంకే వర్గాల్లో ఆవేశాన్ని రగిల్చాయి. మళ్లీ డీఎంకేకు అనుకూలంగా తిరునావుక్కరసర్ స్పందించే యత్నం చేస్తున్నా, డీఎంకే వర్గాలు మాత్రం కాంగ్రెస్‌కు స్థానికంలో చెక్ పెట్టాలన్న వ్యూహంతో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక అన్నాడీఎంకే కాంగ్రెస్‌కు సానుకూలంగా స్పందించినా.. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి గుణపాఠం చెప్పే దిశలో స్థానిక సీట్ల బేరాల్లో పొమ్మని పొగ బెట్టే విధంగా వ్యవహరించాలని అధిష్టానంపై పలువురు డీఎంకే నాయకులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
 
ఈ పరిస్థితుల్లో తిరునావుక్కరసర్ డీఎండీకే అధినేత విజయకాంత్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నట్టు అయింది. తమ భేటీలో స్థానిక చర్చ సాగినట్టు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించడం గమనార్హం. డీఎంకే పక్కన పెట్టిన పక్షంలో డీఎండీకేతో కలసి పయనించేందుకు తగ్గట్టుగా స్థానిక చర్చ సాగి ఉంటుందేమో అన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.