Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీహార్‌లో గుర్తు తెలియని వ్యాధితో చిన్నారుల మృతికి.. లిచీ పండే కారణమట..

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:40 IST)

Widgets Magazine

బీహార్‌లో చిన్నారులు గత కొన్నేళ్లుగా గుర్తు తెలియని వ్యాధితో ప్రాణాలు కోల్పోవడానికి అసలు కారణం ఏమిటో తెలియవచ్చింది. జ్వరం, స్పృహ కోల్పవడం వంటి లక్షణాలతో చిన్నారులు మృత్యువాత పడటం బీహార్‌లో ఎక్కువైంది. అయితే ఈ మరణాలకు లిచీ పండే కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. లిచీ అనే పండును తినడం వల్లే నారాల సంబంధిత వ్యాధితో చిన్నారులు మరణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 
 
ఈ పండులో ఉన్న హైపోగ్లైసిన్ ఏ లేదా మెథిలినీసైక్లోప్రొఫిల్‌గ్లైసిన్ లాంటి సహజమైన విషపూరిత రసాయనాలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనిపెట్టారు. ముజాఫర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల లోపు ఇద్దరు యువకులపై జరిపిన పరిశోధన ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  
 
ఈ పండ్లు తినడం వల్లే చిన్నారుల శరీర భాగాలు వంకర్లు పోవడం, కోమాలోకి పోవడం జరుగుతోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పండ్లలో విషపూరిత పదార్థాలున్నట్లు వారు చెబుతున్నారు. కాగా, ఈ వ్యాధి బారిన పడ్డ 390మంది చిన్నారుల్లో 122మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే చిన్నారులు లిచీ పండ్లను తినొద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మిస్టర్ ట్రంప్ మీరెప్పుడేనా.. 24 గంటలు ఆహారం, నీరు లేకుండా ఉన్నారా?.. నేను ఉగ్రవాదినా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. ...

news

తప్పతాగి డ్యాన్స్ చేశారు.. గాల్లోకి కాల్పులు జరిపారు.. 13 ఏళ్ల కుర్రాడిని చంపేశారు..

మ్యూజిక్ విని ఫంక్షన్‌కు వెళ్ళిన 13ఏళ్ల పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన థానే ...

news

చెన్నై బీచ్‌కి ఆయిల్ తెట్టు... బాబోయ్ చేపలు కొనొద్దంటూ...

చెన్నై పోర్టుకు సమీపంలో శనివారం నాడు రెండు రవాణా నౌకలు ఢీకొట్టుకున్న ఘటనలో పెద్దఎత్తున ...

news

మాదక ద్రవ్యాలకు బానిసైపోయాడు.. ప్రశ్నించిన తల్లిని కాంపస్‌తో పొడిచేశాడు..

మాదక ద్రవ్యాలకు బానిస అయిపోయిన కన్నకొడుకును తన మాటలతో సరిదిద్దాలనుకున్న పాపానికి.. ఆమెకు ...

Widgets Magazine