శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (18:46 IST)

నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్‌కు 10,06,813 ఇమెయిల్స్!

నెట్ న్యూట్రాలిటీ (అంతర్జాల సమానత్వం)కి మద్దతుగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పది లక్షల ఈమెయిల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ట్రాయ్ వెల్లడించింది. ప్రధానంగా ఒక సామాజిక ప్రచారంపై దేశంలో ప్రజల నుంచి ఇంత పెద్ద స్థాయిలో స్పందన రావడం ఎప్పుడూ చూడలేదని ట్రాయ్ పేర్కొంది. నెట్ న్యూట్రాలిటీని సమర్ధిస్తూ దేశంలోని నెటిజన్ల నుంచి 10,06,813పైగా ఇమెయిల్స్ వచ్చినట్టు తెలిపింది. 
 
నెట్ న్యూట్రాలిటీపై అభిప్రాయాలు తెలపాలంటూ మార్చి 27వ తేదీన ట్రాయ్ తన వెబ్‌సైట్‌లో ఓ కన్సల్టేషన్ పేపర్‌ను ఉంచింది. దానికి అభిప్రాయాలు తెలిపేందుకు ఈనెల 24వ తేదీని చివరి రోజుగా నిర్ణయించింది. దీంతో నెటిజన్లు భారీ స్పందించి ఈమెయిల్స్ ద్వారా తమ స్పందనను తెలియజేశారు. ఇప్పటికీ కూడా అనేక మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను పంపుతూనే ఉన్నారు. అయితే, ట్రాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.