Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య ప్రేమించింది.. ప్రేమికుడితో వివాహం జరిపించిన భర్త.. ఎక్కడ?

సోమవారం, 12 మార్చి 2018 (08:15 IST)

Widgets Magazine
marriage

ప్రేమించిందని.. పెళ్ళయ్యాక తెలుసుకున్న ఏం చేశాడంటే..? భార్యకు ఆమె ప్రేమికుడి పెళ్లికి పెద్దగా నిలిచాడు. ఈ ఘటన ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. మనువాడిన అమ్మాయి.. పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించిందని.. అతనితో వుండేందుకే ఆమె ఇష్టపడుతుందని తెలుసుకున్న భర్త.. పెద్ద మనసుతో ఆలోచించాడు. దగ్గరుండి వారి పెళ్లి జరిపించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పంపారాకు చెందిన 28 ఏళ్ల బసుదేవ్ టప్పూకు 24 ఏళ్ల మహిళతో ఈ నెల నాలుదో తేదీన అట్టహాసంగా వివాహం జరిగింది. వివాహమైనా ప్రేయసిని వదిలి వుండలేకపోయిన కజిన్.. కొత్త పెళ్లికూతురితో సన్నిహితంగా వుండటాన్ని బంధువులు గమనించి అతనిపై దాడి చేశారు. కానీ పెళ్లి కూతురు అతడే తన ప్రేమికుడని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. 
 
పెద్దల ఒత్తిడి వల్లే ఈ వివాహం చేసుకోవాల్సి వచ్చిందని కొత్త వధువు చెప్పడంతో కొత్త పెళ్లి కొడుకు సీన్లోకి వచ్చాడు. కట్టుకున్న భార్య అలా చెప్పడంతో షాక్ తిన్నప్పటికీ.. కొంతసేపటికే ఓ నిర్ణయానికి వచ్చాడు. తన భార్య ప్రేమించిన వ్యక్తితోనే ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలనుకున్నాడు. భార్య తల్లిదండ్రులు, సోదరులతో ఒప్పంచి.. ప్రేమికుడితో ఘనంగా వివాహం జరిపించాడు. 
 
ఈ వివాహానికి వందలాది మంది హాజరయ్యారు. వధూవరులను దీవించారు. భార్యకు ప్రేమికుడితో వివాహం జరిపించిన టప్పూను బంధువులు, స్నేహితులు ప్రశంసలతో ముంచెత్తారు. భార్యకు ప్రేమికుడితో వివాహం జరిపించకపోయి వుంటే మూడు జీవితాలు నాశనమైపోవుండేవని చెప్పాడు. ప్రస్తుతం ఆమెతో పాటు ముగ్గరం సంతోషంగా వున్నామని తెలిపాడు.
 
టప్పూ నిర్ణయాన్ని ఆతడి తల్లి కూడా స్వాగతించింది. ఇక టప్పూ చేసిన సాయానికి జీవితాతం రుణపడి వుంటామని మాజీ భార్య తెలిపింది. పెళ్లైన రోజే నిజం తెలియడం.. అందుకు టప్పూ అంగీకరించడం పట్ల మాజీ భార్య హర్షం వ్యక్తం చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఈడా ఉంటా... ఆడా ఉంటా : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ అనే పేరుతో ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు ...

news

ఎవ‌రీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్?

టి.ఆర్.ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్ పేరును ఖ‌రారు చేసింది. ...

news

కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడుకి రాజ్యసభ సీటు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ ...

news

ఓ నర్తకి నా మనసు పాడు చేసింది : ఆజాం ఖాన్ (వీడియో)

సినీ నటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) సీనియర్ నేత ఆజాంఖాన్‌ చురకలు అంటించారు. తనను ...

Widgets Magazine