Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అత్తా ఆశీర్వదించు.. రంగంలోకి దిగుతున్నా... దినకరన్, నేను కూడా వచ్చాక చక్రం... శశి

మంగళవారం, 6 జూన్ 2017 (15:05 IST)

Widgets Magazine
ttv dinakaran

తమిళ రాజకీయాల్లో గత కొన్నిరోజుల ముందు వరకు రజినీకాంత్ వ్యవహారమే హాట్ టాపిక్ ఉంది. అయితే దినకరన్ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన గురించి తమిళ రాజకీయాలు కోడై కూస్తున్నాయి. అన్నాడిఎంకే పార్టీకి సారథ్యం వహించేందుకు దినకరన్ వేగంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్పినట్లుగానే దినకరన్ కూడా అదే చేసేస్తున్నాడు. బయటకు వచ్చిన వెంటనే తమిళ రాజకీయాలపై రహస్యంగా 25 మంది అన్నాడిఎంకే ఎమ్మెల్యేలతో సమావేశమైన దినకరన్ ఆ తరువాత దూకుడు పెంచి అత్త శశికళ ఆశీస్సుల కోసం బెంగుళూరుకు వెళ్ళాడు.
 
జైలులో ఉన్న శశికళను కలిసి అత్తా మీ.. ఆశీస్సులు కావాలి.. మళ్ళీ కథనరంగంలోకి దిగుతున్నా అంటూ చెప్పాడట. మేనల్లుడు కాస్త జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలుసుకున్న శశికళ ఇప్పటికే ఎంతో సంతోషంలో ఉన్నారు. మళ్ళీ అన్నాడిఎంకే పార్టీ తన కనుసన్నలో నడుస్తుందనేది శశికళ ఆలోచన. అనుకున్నట్లుగానే మేనల్లుడు టిటివీ దినకరన్ కూడా అదే వ్యూహంతో ముందుకు వెళుతుండటంతో శశికళ సంతోషానికి పట్టాపగ్గాల్లేకుండా పోయాయట. 
 
ఒక్క ఉదుటన దూకి మళ్ళీ మన చేతుల్లోకి పార్టీని తీసుకో దినకరనా.. అంటూ శశికళ దీవించారట. మొత్తంమీద దినకరన్ ఏ వ్యూహాలతో అన్నాడిఎంకేని మళ్ళీ తనవైపు తిప్పుకుంటారో, ఏ పదవిలో కొనసాగుతారో అన్నది ఆసక్తిగా మారుతోంది. మరోవైపు తను కూడా బెయిల్ పైన విడుదలై వచ్చాక చక్రం పూర్తిగా తిప్పేద్దామని ఆమె చెప్పినట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దళితుడిని పెళ్లి చేసుకుంది.. అల్లుడితో గర్భవతిగా ఇంటికొచ్చింది.. అంతే సజీవదహనం చేసేసారు..

దేశంలో పరువు హత్యల సంఖ్య పెరుగుతూనే వుంది. ఓ దళితుడిని వివాహం చేసుకుందని.. తద్వారా పరువు ...

news

ముస్లిం దేశాలపై నిషేధం.. కింది కోర్టుల నిర్ణయాలకు ట్రంప్ సవాల్.. సుప్రీం తీర్పు కోసమే వెయిటింగ్..

ఆరు దేశాలకు చెందిన ముస్లిం పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా విధించి వివాదాస్పద ...

news

కవల పిల్లలను గట్టిగా కౌగిలించుకుని ఊపిరాడనీయకుండా చంపేసిన కసాయి తల్లి

కవల పిల్లలు పుట్టారు. వారు ఆలనాపాలనా చూసుకుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. ...

news

చిన్నమ్మను రహస్యంగా కలిసిన విజయమ్మ.. విలీనానికి 2 నెలల గడువు ఇచ్చిన దినకరన్..?

దినకరన్ చిన్నమ్మను కలిసి వెళ్ళాక.. శశికళను ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ...

Widgets Magazine