శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (10:42 IST)

వేద నిలయం నుంచి మన్నార్గుడి మాఫియాను గెంటివేస్తాం : ఓ.పన్నీర్ సెల్వం

తమిళ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఎలాగైనా సీఎం పీఠంపై కూర్చోవాలని శశికళ... ఎట్టి పరిస్థితుల్లో అది జరగకూడదని ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఉన

తమిళ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఎలాగైనా సీఎం పీఠంపై కూర్చోవాలని శశికళ... ఎట్టి పరిస్థితుల్లో అది జరగకూడదని ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఉన్నారు. అదేసమయంలో శశికళ సీఎం కాకుండా అడ్డుకునేందుకు పన్నీర్‌కు అండగా ఉండేందుకు 89 మంది ఎమ్మెల్యేలున్న విపక్ష నేత ఎంకేస్టాలిన్ అండంగా ఉండటంతో తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో, తమిళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రి విద్యాసాగర్ రావు ముంబై నుంచి చెన్నై బయలుదేరారు. దీంతో, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరోవైపు, మొన్నటి దాకా సైలెంట్‌గా ఉన్న పన్నీర్ సెల్వం... ఇప్పుడు తూటాల్లాంటి మాటలతో శశికళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 
 
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయంను స్మారక మందిరంగా చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ తిష్టవేసివున్న శశికళతో పాటు.. మన్నార్గుడి మాఫియాను వేద నిలయం నుంచి గెంటివేస్తామని ప్రకటించారు. అలాగే, తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, చెన్నైకు గవర్నర్ రాగానే ఆయనను కలిసి తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని ప్రకటించడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.