గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (19:13 IST)

షార్ట్స్, టీషర్ట్స్ ధరించిన అమ్మాయిలు కోతులా?... టీవీ ఛానల్‌పై మహిళా సంఘాలు ఫైర్..

అసలే స్వేచ్ఛా ప్రపంచం, అందులోనూ ఆధునిక యుగం ఇక ఫ్యాషన్‌కు కొదువేముంది. అమ్మయిలు తమకు నచ్చిన దుస్తులు వేసుకుని ఆకట్టుకుంటున్నారు. అయితే ఒరిస్సా రాష్ట్రంలో ఒక టీవీ ఛానల్‌ మాత్రం షార్ట్స్, టీషర్ట్స్ ధరించే అమ్మాయిలను కోతులుగా అభివర్ణించింది. అంతే ఇంకేముంది అక్కడి మహిళా సంఘాలు ఆ టీవీ ఛానల్‌పై విరుచుకు పడ్డాయి.
 
వివరాల్లోకి వెళితే.. అస్సాం‌లో ప్రసిద్ధి చెందిన న్యూస్ టీవీ ఛానల్ ‌ఒకటి ఇటీవల ఒక స్పెషల్ స్టోరీని ప్రసారం చేసింది. అందులో ఒక కోతి టీషర్ట్ ధరించినట్టు ఒక దృశ్యం కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌లో 'ఈ రోజుల్లో కోతులు కూడా టీషర్ట్‌లు ధరించడం ఆరంభించాయి. వాటిని ఎలా వాషింగ్ చేసుకోవాలో కూడా నేర్చుకున్నాయి. అయితే గౌహతీలో ఉన్న యంగ్ ఏజ్ అమ్మాయిలు తమ సౌకర్యం కోసం షార్ట్స్ ధరించం ప్రారంభించారు. స్కిన్ షో చేయడమే ఫ్యాషన్ అని వారు అనుకుంటున్నారు' అంటూ అస్సాం భాషలో వార్తలు వినిపించాయి. ఆ సమయంలో పలువురు అమ్మాయిలు షార్ట్, టీషర్టులు ధరించి రోడ్డుపై వెళుతున్నట్టు టీవీలో చూపారు. ఈ షోను చూసిన మహిళలో ఆవేశంతో ఊగిపోయారు.
 
మహిళలను కోతులుగా అభివార్ణించిన ఆ టీవీ ఛానల్ లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ రోడ్డుపైకి ఎక్కి ఆందోళనలు చేపట్టారు. అయితో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే ఆ టీవీ ఛానల్ యాజమాన్యం ఈ షో వలన మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నందుకు చింతిస్తున్నాము. ఇటువంటి షోను ప్రదర్శించినందుకు క్షమించాలని బహిరంగ క్షమాపణలు కోరారు.