శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 మే 2016 (10:39 IST)

రవాణా చార్జీలు పెంచిన ఉబెర్ క్యాబ్... డే లైట్ రాబరీగా అభివర్ణించిన కేజ్రీవాల్

ఉబెర్ క్యాబ్ ఢిల్లీలో రవాణా చార్జీలను భారీగా పెంచేసింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. పెంచిన చార్జీలను తగ్గించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఢిల్లీలో తిరిగే ఈ సర్వీసుల్లో యాప్ ఆధారిత క్యాబ్ సేవల రవాణా చార్జీలను అమాంతం పెంచేయడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. కొన్ని కంపెనీలు ధరలను 3 రెట్ల వరకూ పెంచుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ట్వీట్ చేశారు. ఈ ధరల పెంపు పద్దతిని 'డే లైట్ రాబరీ' (పట్టపగలు నిలువుదోపిడీ)గా ఆయన అభివర్ణించారు. 
 
గత నెలలో సరి-బేసి విధానం అమలు చేస్తున్నప్పుడు క్యాబ్ సేవలకు డిమాండ్ రాగా, అప్పుడు కూడా ఓలా, ఉబెర్ వంటి సంస్థలు చార్జీలను పెంచాయి. ఆపై ప్రభుత్వం చర్యలకు దిగడంతో ఆయా కంపెనీలు వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే.