గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (15:00 IST)

ఉబెర్ క్యాబ్ తొలి మహిళా డ్రైవర్ ఆత్మహత్య.. తెలుగమ్మాయే.. బెంగుళూరులో దారుణం!

తొలి మహిళా ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంది. బెంగుళూరులో ఆమె ఒంటరిగా నివశిస్తున్న ఇంట్లోనే ఉరి వేసుకుని ఈ బలవన్మరణానికి పాల్పడింది. ఆమె పేరు భారతీ వీరత్. రెండేళ్ళ క్రితం ఉబెర్ క్యాబ్‌లో తొలి మహ

తొలి మహిళా ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంది. బెంగుళూరులో ఆమె ఒంటరిగా నివశిస్తున్న ఇంట్లోనే ఉరి వేసుకుని ఈ బలవన్మరణానికి పాల్పడింది. ఆమె పేరు భారతీ వీరత్. రెండేళ్ళ క్రితం ఉబెర్ క్యాబ్‌లో తొలి మహిళా క్యాబ్ డ్రైవర్‌గా చేరింది. ఆ రోజున ఆమె వార్తను అన్ని వార్తా పత్రికలు పతాక శీర్షికల్లో ముద్రించాయి. అయితే, సోమవారం సాయంత్రం ఆమె అనుమానాస్పదస్థితిలో ఇంట్లో ప్రాణాలు విడిచారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియలేదు.
 
 
ఆంధ్ర ప్రాంతానికి చెందిన భారతి వీరత్ అనే మహిళ తొలుత ఒక టైలర్గా పనిచేస్తుండేది. ఆమె ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా డ్రైవింగ్ నేర్చుకొని ఆ తర్వాత ప్రైవేట్ క్యాబ్ సంస్థ అయిన ఊబెర్లో చేరింది. దీంతో బెంగళూరులో తొలి మహిళా క్యాబ్ డ్రైవర్గా గుర్తింపుకెక్కింది. బెంగళూరులోనే ఓ నివాసంలో ఆమె ఒంటరిగా ఉంటోంది. పదేళ్ల కిందట ఆంధ్ర ప్రాంతం నుంచి బెంగళూరుకు వచ్చిన ఆమె ఇటీవల తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. 
 
ఇంటి యజమాని చెప్పిన ప్రకారం ఆదివారం నుంచి భారతీ కనిపించకపోవడంతో ఆమె ఉంటున్న మూడో అంతస్తుకు వెళ్లి చూడగా ఆమె ఓ చీరలాంటిదానితో ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. భారతి ఫోర్డ్ ఫియస్టా కారును నడుపుతూ జీవనం సాగిస్తూ వస్తోంది.