శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (10:58 IST)

UGCని రద్దు చేయడం మంచిది: గౌతం కమిటీ సిఫారసు

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని రద్దు చేయడంమంచిదని గతంలో ఈ సంస్థకు చైర్మన్‌గా పనిచేసిన హరి గౌతం నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. యూజీసీతో ఎలాంటి ప్రయోజనం లేకపోగా, అనవసర ఖర్చులు తడిసిమోపెడతువున్నాయని గౌతం కమిటీ తేల్చిచెప్పింది. 
 
ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రెండు భారీ సంపుటాల్లో సమగ్ర నివేదికను సమర్పించింది. దేశంలోని ఉన్నత విద్యాలయాల పర్యవేక్షణ కోసం ‘నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అథారిటీ’ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించిన ఈ కమిటీ నివేదిక పట్ల కేంద్రం కూడా సానుకూలంగానే ఉందట.
 
ఇంకా చెప్పాలంటే, నిర్దేశిత లక్ష్యాలను అందుకోవడంలో ఈ సంస్థ ఘోరంగా విఫలమైందట. విద్యాలయాల నిర్వహణను యూజీసీ గాలికొదిలేసిందట. కేవలం నిధుల విడుదలకు మాత్రమే పరిమితమైందని గౌతం కమిటీ పేర్కొంది.