Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేపిస్టులకు తలకిందులుగా వేలాడదీసి.. చితకబాది.. దెబ్బలపై కారం పూయాలి: ఉమాభారతి

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (17:35 IST)

Widgets Magazine

తరచూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తాజాగా అత్యాచార దోషులపై విరుచుకుపడ్డారు. సర్జికల్‌ దాడులపై అనుమానాలు వ్యక్తంచేసిన వారిని వెళ్లి పాకిస్థాన్‌ పౌరసత్వం తీసుకోమని గతంలో వ్యాఖ్యానించిన ఉమాభారతి.. అత్యాచారాలకు పాల్పడిన వారికి చుక్కలు చూపించాలన్నారు. 
 
అత్యాచారాలకు పాల్పడిన వారు తమను బతకనివ్వమని వేడుకోవాలి.. అలాంటి వారిని తలకిందులుగా వేలాడదీసి చితకబాది వారి దెబ్బలపై కారం పూయాలి. వాళ్లు గట్టి గట్టిగా ఏడుస్తుంటే.. అరుస్తుంటే బాధిత మహిళలు చూడాలని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేపిస్ట్‌ల భరతం పట్టానని ఉమాభారతి తెలిపారు. రేపిస్టులను హింసించి, క్షమించమని బాధితుల కాళ్లు పట్టుకునేలా చేశానన్నారు.
 
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ.. బాధితుల ముందు రేపిస్టుల భరతం పట్టాలి. దిక్కులేక వాళ్లు క్షమించమని బాధితుల కాళ్ల మీద పడాలి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే చేయించాను' అని పేర్కొన్నారు. తాను గతంలో పోలీసులకు అలాగే చేయమని చెప్పానని వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గోల్డెన్ బే రిసార్ట్స్‌ వద్ద హైటెన్షన్... మీడియా సిబ్బందిపై శశికళ ప్రైవేట్ బౌన్సర్ల దాడి?

తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన నెంబర్‌గేమ్‌లో ఎలాగైనా నెగ్గేందుకు అన్నాడీఎంకే ప్రధాన ...

news

తమిళనాడు సంక్షోభంలో రాష్ట్రపతి వేలెట్టలేరు : ప్రెసిడెంట్ రాజ్యాంగ అడ్వైజర్

ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంలో రాష్ట్రపతి ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం ...

news

శశికళ గురించి ప్రధాని మోదీకి తెలిసిన అసలు నిజం... ఏంటది?

తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో మోదీ ఏ వర్గానికి కొమ్ముకాయనున్నారనే ఆలోచన ప్రస్తుతం ...

news

శశికళ వర్గ ఎమ్మెల్యేల జాబితాలో పన్నీర్ పేరు.. సంతకం.. ఎమ్మెల్యేలు సంతకాలన్నీ ఫోర్జరీనా?

క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయాల్లో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఒకటి వెలుగులోకి ...

Widgets Magazine