శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (13:04 IST)

బడ్జెట్ లెక్కలివీ..: మొత్తం బడ్జెట్ రూ.17,77,477 కోట్లు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ లోక్సభలో శనివారం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను జైట్లీ రూ.17,77,477 కోట్ల బడ్టెట్ను రూపొందించారు. ఈ బడ్జెట్ లోని ముఖ్యాంశాలు..
 
* కేంద్ర బడ్జెట్ రూ.17,77,477 కోట్లు 
* ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు
* ప్రణాళికా వ్యయం రూ.4,65,000
 
కేటాయింపులు
* విద్యా రంగానికి రూ.68,960 కోట్లు
* మహిళా శిషు సంక్షేమం రూ.10,500 కోట్లు
* వైద్యానికి రూ. 3,31,500 కోట్లు
* రక్షణకు రూ.2,46,727 కోట్లు
* జల వనరులకు రూ.4,173 కోట్లు
* శిశు సంరక్షణకు 300 కోట్లు
* చైల్డ్ డెవలప్మెంట్ కు 1500 కోట్లు
* మౌలిక వసతులకు 70 వేల కోట్లు
* స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి
* చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు
*  గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు.
* గృహనిర్మాణాలకు రూ.22,407 కోట్లు
* సోలార్ ఎలక్ట్రికల్ వాహనాలకు రూ.70 కోట్లు
* అల్ట్రా మెగా పవర్కు లక్ష కోట్లు.
* ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు
* గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు
* వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం.
* మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
* నాబార్డుకు 25 వేల కోట్లు
* ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు 
* నిర్భయ ఫండ్కు వెయ్యి కోట్లు
* వీసా ఆన్ అరైవల్ స్కీం కింద 150 దేశాలు
* మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
* ఎంజీఎన్ రేగాకు రూ.5 వేల కోట్లు
* స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు
* ఐటీ హబ్ ఏర్పాటుకు 150 కోట్లు