బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2017 (16:02 IST)

వాజ్‌పేయ్‌కి మత్తు మందిచ్చి.. రాజకీయాలు అర్థం కాకుండా చేశారు: లాలూ ప్రసాద్

బీజేపీ కురువృద్ధుడు, మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయ్ ఆరోగ్యంపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనుమానాలు వ్యక్తం చేశారు. వాజ్‌పేయ్‌కి మత్తు మందిచ్చి.. రాజకీయాలు ఏమాత్రం అర్థం కాని పరిస్థితిని సృష్ట

బీజేపీ కురువృద్ధుడు, మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయ్ ఆరోగ్యంపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనుమానాలు వ్యక్తం చేశారు. వాజ్‌పేయ్‌కి మత్తు మందిచ్చి.. రాజకీయాలు ఏమాత్రం అర్థం కాని పరిస్థితిని సృష్టించారని విమర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్యంపై విచారణ జరపాలని లాలూ డిమాండ్ చేశారు. లాలూ చేసిన వ్యాఖ్యలు ఇటు బీజేపీలోనూ, అటు వాజ్‌పేయి ఫ్యాన్స్‌ల్లోనూ పెనుదుమారం రేపాయి. 
 
అయితే లాలూకు బీహార్‌కు చెందిన కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత రాథామోహన్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. లాలూ వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోరాదన్నారు. వాస్తవానికి వాజ్‌పేయి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, ఇంటి నుంచి బయటికి వచ్చి చాలాకాలం గడిచిపోయిందని రాథామోహన్ గుర్తు చేశారు. 
 
మూడేళ్ల క్రితం వాజ్‌పేయికి భారత రత్న పురస్కార ప్రదానోత్సవం కూడా అత్యంత నిరాడంబరంగా జరిగింది. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. భారత రత్న అవార్డును అందించారు. ఆయనకు అవార్డు ఇస్తున్నట్లు ఉన్న కొన్ని ఫోటోలను మాత్రమే అప్పుడు విడుదల చేశారు. వృద్ధాప్యం, తీవ్ర అనారోగ్యం కారణంగానే వాజ్‌పేయి బయటకు రాలేని పరిస్థితి ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది.
 
ఆ తర్వాత ఏళ్లు గడిచిపోయాయి. కాగా వాజ్‌పేయ్‌‌ని బీజేపీ సీనియర్ నేత అద్వానీ కలిసొస్తారు. అద్వానీతో పాటు ప్రధాన మంత్రి మోడీ ఆయనింటికి వెళ్ళి పరామర్శించడంతో పాటు రాజకీయ సలహాలు పుచ్చుకుంటున్నారు.