Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రైతులపై కాల్పులు.. కలెక్టర్‌ను బదిలీ చేశాం : వెంకయ్య నాయుడు

గురువారం, 8 జూన్ 2017 (17:56 IST)

Widgets Magazine
venkaiah

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైతులపై జరిపిన కాల్పుల వ్యవహారానికి సంబంధించి ఎస్పీ, కలెక్టర్‌ను బదిలీ చేశారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ లో రైతుల మృతిని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. 
 
బీజేపీ రైతు వ్యతిరేకి అని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో రైతులకు పది లక్షల కోట్ల రుణాలిచ్చామని, తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా వచ్చేలా పథకం తీసుకొచ్చామని, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.50 వేల కోట్లు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. 
 
అదేసమయంలో గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరగడం బాధాకరమని, ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ, కలెక్టర్‌ను బదిలీ చేశారని, రైతులపై కాల్పుల ఘటనపై న్యాయ విచారణ జరుగుతోందని వెంకయ్యనాయుడు అన్నారు. రైతులతో ఫొటోలు దిగేందుకే రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ పర్యటన పెట్టుకున్నారని వెంకయ్య ఎద్దేవా చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఔను.. పోలీసు కాల్పుల్లోనే చనిపోయారు.. అయితే ఏంటి: మధ్యప్రదేశ్ మంత్రి

గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతులపై మధ్యప్రదేశ్ పోలీసులు జరిపిన తుపాకీ కాల్పుల్లో ...

news

ఎంత ధైర్యం... కొండ చిలువను చంపేసిన మహిళ... ఎక్కడ? (Video)

ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ... ఏకంగా కొండ చిలువను చంపేసింది. తన మేక ప్రాణాలు ...

news

బ్రేక్‌ఫాస్ట్‌లో 10 కేజీల బీఫ్ ఫ్రై ఆరగించి... బీఫ్ బ్యాన్‌పై చర్చించిన ఎమ్మెల్యేలు

దేశంలో వామపక్ష పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు లేదా ...

news

సిరియా బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

సిరియా దేశంలో చెలరేగిన అంతర్యుద్ధంలో పలువురు చిన్నారులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ...

Widgets Magazine