శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (11:39 IST)

రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకోవడమే మైనస్.. సమాజ్ వాదీని అదే కొంపముంచింది..

యూపీలో సమాజ్ వాదీ పార్టీకి ఈ ఎన్నికలు మంచి గుణపాఠం నేర్పాయి. పార్టీలో కుటుంబ కలహాలతో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ తరపున ప్రచారానికి దిగడం కొంపముంచింది. దీంతో బీజేపీ అతిపెద్ద పార్ట

యూపీలో సమాజ్ వాదీ పార్టీకి ఈ ఎన్నికలు మంచి గుణపాఠం నేర్పాయి. పార్టీలో కుటుంబ కలహాలతో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ తరపున ప్రచారానికి దిగడం కొంపముంచింది. దీంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 250కి పైగా సీట్లు గెలుచుకుంది.

సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం మైనస్ అయ్యింది. వరుసగా అన్నీ రాష్ట్రాల్లో ఓడిపోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇక కష్టాలేనని రాజకీయ పండితులు అంటున్నారు. యూపీలో రాహుల్‌తో జతకట్టి సమాజ్ వాదీ పార్టీ తప్పు చేసిందని.. ఇకపై ఆ తప్పు ఏ పార్టీ చేయబోదని వారు అంటున్నారు. 
 
ఇకపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి కూడా అంత పనివుండదని రాజకీయ పండితులు అంటున్నారు. 403 అసెంబ్లీ స్థానాలు కలిగిన యూపీలో మేజిక్ ఫిగర్ 202. కాంగ్రెస్‌తో జత కట్టకపోయినా ఎస్పీకి ఇప్పటి కంటే ఎక్కువ సీట్లు వచ్చేవని చెప్తున్నారు. ఆ పార్టీతో కలవడం వల్ల 100కు పైగా సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. అందులో ఎస్పీ గెలిచే సీట్లు కూడా ఉన్నాయి. 403 స్థానాలలో కనుక ఎస్పీ పోటీ చేస్తే ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వచ్చేవని, అలాగే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేదని అంటున్నారు. మాయావతితో చేతులు కలిపివుంటే సమాజ్ వాదీ పార్టీకి కాస్తైనా మెరుగైన ఫలితాలు వచ్చేవని.. కాంగ్రెస్‌తో కలిసి అన్యాయంగా యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఓడిపోయిందని రాజకీయ పండితులు అంటున్నారు. 
 
ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీతో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇరు పార్టీలు కలిసి కూడా వంద సీట్లు గెలవలేకపోతోంది. దీనిని బట్టే కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తు పెద్ద తప్పుగా అర్థం చేసుకోవచ్చునని వారు చెప్తున్నారు.