శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 జులై 2016 (17:24 IST)

మైనర్ బాలికలకు మొబైల్స్ వద్దే వద్దు.. ఖాప్ పంచాయతీ.. వాట్సాప్ ద్వారా ఆ వీడియో వచ్చాక..?!

ఉత్తరప్రదేశ్‌లోని ఈటా జిల్లాలోని ఖాప్ పంచాయతీ ఓ వింత నిర్ణయం తీసుకుంది. ఆ గ్రామంలో 18 ఏళ్ళు నిండని అమ్మాయిలకు సెల్ ఫోన్ వాడే అర్హత లేదని ప్రకటించింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఈటా జిల్లాలోని ఖాప్ పంచాయతీ ఓ వింత నిర్ణయం తీసుకుంది. ఆ గ్రామంలో 18 ఏళ్ళు నిండని అమ్మాయిలకు సెల్ ఫోన్ వాడే అర్హత లేదని ప్రకటించింది. అమ్మాయిలు ఫోన్లు వాడటం వల్లే చెడిపోతున్నారని పంచాయతీ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు కారణాన్ని కూడా పంచాయతీ పెద్దలు వెల్లడించారు. 
 
ఇటీవల ఓ స్కూలు డైరక్టర్ తన పదవిని, వయస్సును మరిచి తన స్కూలులో చదువుకునే విద్యార్థిని (15) పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను లొంగదీసుకుని అసభ్యంగా చిత్రీకరిస్తూ ఓ వీడియోను వాట్సాప్‌లో అప్ చేశాడు. ఈ వీడియో ద్వారా ఆ డైరక్టర్ అరస్టయ్యాడు.
 
దాదాపు 20 మంది బాలికలపై ఆ డైరక్టర్ నీచంగా ప్రవర్తించాడని.. ఈ విషయం వాట్సాప్ ద్వారా బాగా ప్రచారం కావడంతోనే 18 ఏళ్లు నిండని బాలికలు ఇక ఫోన్లు వాడకూడదని నిర్ణయించినట్లు పంచాయతీ పెద్దలు వెల్లడించారు. ఈ పంచాయతీ వాసులు లోథి రాజ్‌పుట్ రాజ వంశీయులు కావడం గమనార్హం. 4వేల మందితో కూడిన ఈ పంచాయతీలో తప్పకుండా 18 ఏళ్లు నిండని మైనర్ బాలికలు సెల్ ఫోన్లు వాడకూడదని పంచాయతీ పెద్దలు హుకుం జారీ చేశారు.