శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (15:45 IST)

అగస్టా డీల్ కోసం నిబంధనలు మార్చేశారు : రక్షణ మంత్రి పారీకర్

వీవీఐపీ చాపర్ల కోసం అగస్టాతో డీల్‌ కుదుర్చుకోవడానికి నిబంధనలు మార్చి కేవలం అగస్టాతోనే డీల్‌ కుదుర్చుకునేలా చేశారని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ ఆరోపించారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపీ చాపర్‌ కుంభకోణంపై ఆయన శుక్రవారం పార్లమెంటులో వివరాలు వెల్లడించారు.
 
నిజానికి ఈ స్కామ్‌ జరగకుండా 2012లోనే ఆపి ఉండాల్సిందన్నారు. కాంగ్రెస్‌ వీవీఐపీ చాపర్ల కోసం అగస్టాతో డీల్‌ కుదుర్చుకోవడానికి నిబంధనలు మార్చి కేవలం అగస్టాతోనే డీల్‌ కుదుర్చుకునేలా చేసిందని ఆరోపించారు. 
 
సీఎన్‌సీ(కాంట్రాక్ట్‌ నెగోషియేషన్స్‌ కమిటీ) పేర్కొన్న బెంచ్‌ మార్క్‌ ధర అవసరానికన్నా యాక్సెప్టన్స్‌ ఆఫ్‌ నెసెసిటీ) ఆరు రెట్లు అధికంగా ఉందన్నారు. 2013 మార్చిలో సీబీఐ అగస్టా అంశంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని.. కానీ డిసెంబరు వరకు ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఈడీకి పంపించలేదని పారికర్‌ తెలిపారు.