శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (13:35 IST)

కట్జూ వ్యాఖ్యలను సమర్ధించిన కేంద్ర ప్రభుత్వం!

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ జిల్లా జడ్జిని యూపీఏ హయాంలో మద్రాసు హైకోర్టు అదనపు జడ్జిగా నియమించేందుకు డీఎంకే నేత సాయం చేశారంటూ తాజాగా భారతీయ ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మర్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలను నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా సమర్ధించింది. 
 
ఇదే అంశంపై మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 2005, జులై 16న అతనిని (జడ్జి) పొడిగించేందుకు కొల్లెజియం కూడా పరిగణించినట్లు ఓ నోట్ చెబుతోందన్నారు. అందువల్ల ఖట్జూ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఉభయసభల్లోనూ డీఎంకే సభ్యులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.