శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (15:10 IST)

2014 సివిల్స్ ఫలితాలు విడుదల: అమ్మాయిలదే పైచేయి

సివిల్స్ పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. సివిల్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) శనివారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొదటి ఐదు ర్యాంకుల్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. ఇరా సింగాల్‌ టాప్ ర్యాంకులో నిలవగా, రేణూ రాజ్, నిధి గుప్తా, వందనారావులు వరుసగా నాలుగో ర్యాంకు వరకు నిలిచారు. 
 
ఇక సుహర్ష భగత్ ఐదో ర్యాంకును సాధించి పురుష అభ్యర్థుల్లో తొలి స్థానంలో నిలిచాడు. సివిల్స్ పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎం సాకేత్ రాజాకు 14వ ర్యాంకు, లక్ష్మీకాంత్ రెడ్డికి 21వ ర్యాంకు, సుంకర రాజ్ గోపాల్‌కు 49వ ర్యాంకు, క్రాంతికుమార్‌కు 50వ ర్యాంకు, ఎంవీఆర్ తేజకు 66వ ర్యాంకు, వేదితా రెడ్డికి 71వ ర్యాంకు, లక్ష్మీ భవ్యకు 88వ ర్యాంకు లభించాయి. ఇకపోతే.. ఉత్తీర్ణులైన వారిలో నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీస్ సెక్టార్ ఉద్యోగాల్లోకి 1,236 మందిని ఎంపిక చేయనున్నారు.