Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒకే బిడ్డే ముద్దు.. రెండో బిడ్డ వద్దు.. ఇదీ నగరంలోని మహిళల తీరు.. అసోచామ్

శనివారం, 13 మే 2017 (14:50 IST)

Widgets Magazine

పిల్లల పెంపకం పట్ల నగరంలో జీవించే మహిళలు విముఖత చూపిస్తున్నారట. నగర భారతంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో 35 శాతం మంది మహిళలు.. పిల్లలను పెంచేందుకు.. వారితో వెచ్చించే సమయం, ఓపిక లేకపోవడంతో ఒకే సంతానంతో సరిపెట్టుకుంటున్నారని అసోచామ్ సర్వేలో తేలింది. అసోచామ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 500 మంది ఉద్యోగినులు రెండవ సంతానాన్ని కోరుకోవడం లేదని తెలియవచ్చింది. 
 
ఒక మెటర్నిటీ లీవ్ ఓకే కానీ రెండో మెటర్నిటీ లీవులు తీసుకుని తమ ఉద్యోగాన్ని, పదోన్నతిని పణంగా పెట్టలేమని ఉద్యోగినులు వాపోతున్నారు. ఉద్యోగం ఆవశ్యం కావడంతో పిల్లల పెంపకం ఆసక్తి చూపలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు చెప్తున్నారు. ఈ సర్వేను అహ్మదాబాద్‌, బెంగుళూర్‌, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, ఇండోర్‌, జైపూర్‌, కోల్‌కతా, లక్నో, ముంబయి వంటి పది నగరాల్లో నిర్వహించారు. 
 
ఉద్యోగంలో ఒత్తిడి, ఇంట్లో పని కారణాలతో చాలామంది తల్లులు ఒకే సంతానంతో సరిపెట్టుకోవాలని భావిస్తున్నారని సర్వే తేల్చింది. ఒకే సంతానం కలిగిన 1500 మంది పనిచేసే తల్లులను అసోచామ్‌ సర్వే పలుకరించింది. ఉద్యోగం, ఇల్లును సమన్వయం చేసుకుంటూ వస్తున్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో రెండో సంతానంపై దృష్టి పెట్టట్లేదని సర్వేలో తేలింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లైందనే సంతోషంలో డ్యాన్స్ చేశాడు.. కుప్పకూలిపోయాడు.. ఆ తర్వాత ఏమైంది?

గుజరాత్‌లో ఘోరం జరిగింది. ఓ వివాహవేడుకలో డాన్స్ చేస్తున్న వరుడు అకస్మాత్తుగా ...

news

డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో 56వేల టెక్కీల ఉద్యోగాలు హుష్ కాకి.. రోడ్డున పడితే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో టెక్కీ ఇబ్బందులు పడుతున్నారు. బై ...

news

బస్సులో పోకిరి అసభ్యంగా ప్రవర్తించాడని.. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

బస్సులో ఓ పోకిరి అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. ...

news

రాహుల్ గాంధీపై సెటైర్లు.. మోడీనే టార్గెట్.. రమ్యను అస్త్రంగా తీసుకున్న సోనియా..!

సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ...

Widgets Magazine