శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (10:38 IST)

నియంత్రణ రేఖను దాటి రెచ్చిపోతున్న భారత సేనలు.. 20 మంది ఉగ్రవాదుల హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లోని భారత ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడికి భారత సేనలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. అదీ కూడా.. భారత భూభాగంలో కాదు. నియంత్రణ రేఖ దాటి వెళ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లోని భారత ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడికి భారత సేనలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. అదీ కూడా.. భారత భూభాగంలో కాదు. నియంత్రణ రేఖ దాటి వెళ్లి ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. 
 
ఈ నెల 20, 21వ తేదీల్లో హెలికాప్టర్ ద్వారా భారత బలగాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో అడుగుపెట్టి కనీసం 20 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు సమాచారం. సైనికులతో కూడిన పారాచూట్ రెజిమెంట్ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు సమాచారం. పీవోకేలోని మూడు ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడిలో 18 మంది ముష్కరులు ప్రాణాలు కోల్పోగా 180 మందికిపైగా తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే. 
 
ఈ నెల 20న పీవోకేలోని గిల్గిత్, స్కర్దు నగరాలతోపాటు ఖైబర్-ఫంఖ్తుంఖ్వా ప్రావిన్సులోని చిత్రల్ నగరానికి పాకిస్థాన్ ప్రభుత్వం విమానాలను రద్దు చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.