భర్తను బిర్యానీ, కూల్ డ్రింక్స్‌ అడిగింది.. నగలతో జంప్

శనివారం, 25 నవంబరు 2017 (17:54 IST)

పెళ్లి పేరిట ఓ యువతి యువకుడిని వివాహం చేసుకుంది. పెళ్లైన రెండు రోజుల్లో పెళ్లికొడుకు ఇంటివారు పెట్టిన నగలను, వెండి సామాన్లను దోచుకుని పరారైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య రెండు రోజుల్లోపే కనిపించకపోవడంతో షాకైన యువకుడు పోలీసులకు ఫిర్యదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లా కువాన్‌ హెది గ్రామంలో అజ‌య్ అనే యువ‌కుడికి ఓ మహిళ అమ్మాయిని పరిచయం చేసింది. అదే అమ్మాయిని అజయ్ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు.
 
ఈ నెల 22న వీరి వివాహం జరిగింది. రెండు రోజుల పాటు అతనితో కాపురం చేసి.. జ్వరం తగిలిందని డ్రామా చేసింది. అజయ్ కూడా యువతిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. డాక్టర్ వద్ద నుంచి బయటికి వచ్చాక బిర్యానీ తినాలనిపిస్తుందని చెప్పింది. బిర్యానీ తీసిపెట్టాక కూల్ డ్రింక్స్ కావాలంది. అంతే.. కూల్ డ్రింక్స్ కోసం పక్క షాపుకెళ్లిన అజయ్‌ని మోసం చేసి ఆ యువతి పారిపోయింది. 
 
ఎంత వెతికినా భార్య కనిపించకపోవడంతో ఇంటికొచ్చిన అజయ్‌కి అప్పుడే అసలు నిజం తెలిసింది. ఇంట్లోని నగలన్నీ కనిపించట్లేదని గుర్తించిన అజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ యువ‌తిని త‌మ‌కు ప‌రిచ‌యం చేసిన మ‌రో మ‌హిళ కూడా కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పారిపోయిన ఇద్దరు మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :  
Crime Biryani Jewels Cool Drinks Uttar Pradesh

Loading comments ...

తెలుగు వార్తలు

news

టిటిడి పాలకమండలిలోకి ఉపరాష్ట్రపతి కుమార్తె దీపా వెంకట్...

దాదాపు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న టిటిడి నూతన పాలకమండలి నియామక ప్రకటన ఈ వారంలో వెలువడే ...

news

'డోల్ భాజే' పాట‌కు మానుషి నృత్యం.. వీడియో వైరల్

విశ్వసుందరిగా ఎన్నికైన భారతీయ సుందరాంగి మానుషీ చిల్లర్‌కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ ...

news

33 వేల మందిని మింగేసిన సముద్రం.. ఎక్కడ?

భూమండలంపై ఉన్న సముద్రాల్లో మధ్యదరాసముద్రం ఒకటి. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ సముద్రం ఏకంగా ...

news

భార్యతో పలుకుతున్నాడనీ నగ్నంగా చెట్టుకు కట్టేసి చనిపోయేదాకా కొట్టారు...

కర్ణాటక రాష్ట్రంలోని యద్గిరి జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ యువకుడు తన భార్యతో వివాహేతర ...